జగన్ సర్కార్‌కి హైకోర్టు షాక్: సంగం డెయిరీపై ఏపీ ప్రభుత్వ పిటిషన్ కొట్టివేత
సంగం డెయిరీ స్వాధీనంపై ఏపీ ప్రభుత్వం దాఖలు చేసిన రిట్ పిటిషన్ ను ఏపీ హైకోర్టు ధర్మాసనం కొట్టివేసింది. గతంలో సింగిల్ జడ్జి ఇచ్చిన ఉత్తర్వులను హైకోర్టు సమర్ధించింది.
అమరావతి: సంగం డెయిరీపై ఏపీ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్ ను ఏపీ హైకోర్టు బుధవారంనాడు కొట్టివేసింది.సంగం డెయిరీ పై ప్రభుత్వం దాఖలు చేసిన రిట్ పిటిషన్ ను ఏపీ హైకోర్టు ధర్మాసనం కొట్టివేసింది. సంగం డెయిరీ స్వాధీనం చేసుకొంటూ గతంలో ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
also read:సంగం డెయిరీ కేసు: శ్రీధర్ ఇంటికి పోలీసులు, నోటీసులు జారీ
ఈ ఉత్తర్వులను సంగం డెయిరీ పాలకవర్గం సవాల్ చేసింది. సంగంగ డెయిరీ స్వాధీనం చేసుకోవడంపై ఏపీ ప్రభుత్వం ఇచ్చిన జీవోను ఏపీ హైకోర్టు ఈ ఏడాది మే 7వ తేదీన కొట్టివేసింది. సింగిల్ జడ్జి ఉత్తర్వులను ఏపీ ప్రభుత్వం డివిజన్ బెంచ్ వద్ద సవాల్ చేసింది.అయితే సింగిల్ జడ్జి ఉత్తర్వులనే డివిజన్ బెంచీ కూడా సమర్ధించింది. సంగం డెయిరీని ప్రభుత్వ పరం చేస్తూ ఏపీ ప్రభుత్వం ఈ ఏడాది ఏప్రిల్ 29వ తేదీన జీవో 19ని జారీ చేసింది. ఈ జీవోను సంగం డెయిరీ డైరెక్టర్లు సవాల్ చేశారు. ఈ జీవోను ఏపీ హైకోర్టు సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే.