Asianet News TeluguAsianet News Telugu

సంగం డెయిరీ కేసు: శ్రీధర్ ఇంటికి పోలీసులు, నోటీసులు జారీ

సంగం డెయిరీ మార్కెటింగ్ మేనేజర్ శ్రీధర్ నివాసానికి పోలీసులు వచ్చారు. గుంటూరులోని ఆయన నివాసానికి వచ్చి పోలీసులు నోటీసులు జారీ చేశారు. విచారణకు హాజరు కావాలని వారు అందులో సూచించారు.

Police serve notice to Sangam dairy Marketing manager Sridhar
Author
Guntur, First Published Jun 8, 2021, 7:19 AM IST

అమరావతి: గుంటూరులోని విద్యానగర్ లో గల సంగం డెయిరీ మార్కెటింగ్ మేనేజర్ శ్రీధర్ నివాసానికి పోలీసులు వచ్చారు. విజయవాడలో సంగం డెయిరీ పాలక మండలి సమావేశం నిర్వహించినందుకు ఆయనపై పోలీసులు కేసు నమోదు చేశారు. 

కేసు దర్యాప్తులో భాగంగా పోలీసులు శ్రీధర్ ఇంటికి పటమట పోలీసులు వచ్చారు. పోలీసులు వచ్చిన సమయంలో శ్రీధర్ ఇంట్లో లేరు. ఆయనకు 160 సిఆర్పీసీ కింద నోటీసులు ఇచ్చారు. రేపు విచారణకు హాజరు కావాలని పోలీసులు ఆ నోటీసులో తెలిపారు. 

సంగం డెయిరీ చైర్మన్ గా ఉన్న టీడీపీ నేత దూళిపాళ్ల నరేంద్ర చౌదరిపై ఏసీబీ అధికారులు కేసు నమోదుచేసిన విషయం తెలిసిందే. సంగం డెయిరీ ఎండీ గోపాలకృష్ణన్ ను కూడా ఏసిబీ అధికారులు అరెస్టు చేశారు. వారిద్దరికి కూడా హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది.

ధూళిపాల్ల నరేంద్రపై ఏసీబీ వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేసింది. నరేంద్రపై 408, 409, 418, 420, 465, 471, 120బీ, రెడ్ విత్ 34 సెక్షన్ల కింద ఏసీబీ అధికారులు కేసు నమోదు చేశారు 

Follow Us:
Download App:
  • android
  • ios