కొండపల్లి మున్సిపల్ చైర్మెన్ ఎన్నిక: విచారణ సోమవారానికి వాయిదా

కొండపల్లి మున్సిపల్ ఛైర్మెన్ ఎన్నికపై విచారణను ఏపీ హైకోర్టు సోమవారానికి వాయిదా వేసింది. బుధవారం నాడే మున్సిపల్ చైర్మెన్ ఎన్నిక ప్రక్రియను ముగించారు. ఈ మేరకు నివేదికను అధికారులు హైకోర్టుకు అందించారు. 

AP High court  postpones hearing Kondapally municipal chairman Election to on Nov 29

అమరావతి: కొండపల్లి మున్సిపల్ చైర్మెన్  ఎన్నిక విషయమై విచారణను ఏపీ హైకోర్టు సోమవారానికి వాయిదా వేసింది.  కొండపల్లి మున్సిపల్ చైర్మెన్ ఎన్నిక బుధవారం నాడు జరిగింది. రెండు సార్లు వాయిదా పడిన తర్వాత బుధవారం నాడు ఈ ఎన్నికను నిర్వహించారు. సోమ, మంగళ వారాల్లో కొండపల్లి మున్సిపల్ ఛైర్మెన్ ఎన్నిక వాయిదా పడింది. అయితే ఈ విషయమై Tdp  ఏపీ హైకోర్టును ఆశ్రయించింది. దీంతో  బుధవారం నాడు కచ్చితంగా మున్సిపల్ చైర్మెన్ ను నిర్వహించాలని AP High court ఆదేశాలు జారీ చేసింది. ఏపీ హైకోర్టు ఆదేశాల మేరకు బుధవారం నాడు అధికారులు కొండపల్లి మున్సిపల్ చైర్మెన్ ఎన్నిక ప్రక్రియను నిర్వహించారు.  

Kondapally municipal chairman Election  ఎన్నక ప్రక్రియకు సంబంధించి వీడియోను రికార్డు చేశారు. ఈ వీడియోను ఏపీ హైకోర్టుకు  రిటర్నింగ్ అధికారి సమర్పించారు.  మరో వైపు ఎన్నికలకు సంబంధించిన ప్రక్రియ నివేదికను కూడా అధికారులు కోర్టుకు అందించారు.మరో వైపు  విజయవాడ ఎంపీ కేశినేని నాని  ఎక్స్ అఫిషియో ఓటుకు సంబంధించిన విచారణను  ఏపీ హైకోర్టు సోమవారం నాడు విచారించనుంది. ఈ ఏడాది ఫిబ్రవరిలో విజయవాడలో ఎంపీ కేశినేని నాని  ఎక్స్ అఫిషియో ఓటును నమోదు చేసుకొన్నారని వైసీపీ నేతలు గుర్తు చేస్తున్నారు.

also read:కొండపల్లి మున్సిపల్ చైర్మెన్ ఎన్నిక: వీడియో పుటేజీ హైకోర్టుకు సమర్పణ

 దీంతో కొండపల్లి మున్సిపాలిటీలో విజయవాడ ఎంపీ కేశినేని నాని ఎక్స్‌అఫిషియో ఓటు హక్కు నమోదు చేసుకోవడం సాధ్యం కాదని వైసీపీ నేతలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.  కొండపల్లిలో తనకు ఎక్స్ అఫిషియో ఓటు హక్కు కల్పించాలని ఎంపీ కేశినేని నాని మున్సిపల్ కమిషనర్ కు లేఖ రాశాడు. అయితే ఈ లేఖపై మున్సిపల్ కమిషనర్ నుండి సమాధానం రాకపోవడంతో  కేశినేని నాని ఏపీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ పై హైకోర్టులో ఇవాళ విచారణ జరగనుంది. మరో వైపు  కేశినేని ఎక్స్ అఫిషియో  ఓటు హక్కు విషయమై వైసీపీ కూడా హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది.నిన్న జరిగిన మున్సిపల్ చైర్మెన్ ఎన్నికకు సంబంధించి టీడీపీ చైర్మెన్ అభ్యర్ధికి 16 ఓట్లు, వైసీపీ కి చెందిన చైర్మెన్ అభ్యర్ధికి 15 ఓట్లు వచ్చినట్టుగా సమాచారం. వైస్ చైర్మెన్ కు సంబంధించిన ఎన్నికలో కూడా టీడీపీకి 16, వైసీపీకి 15 ఓట్లు దక్కాయని తెలుస్తోంది.కొండపల్లి మున్సిపాలిటీలో  పాగా వేయాలని టీడీపీ ,  వైసీపీ తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి. ఈ మున్సిపాలిటీలో అధికారులను ఉపయోగించుకొని ఎన్నికల పలితాలను వైసీపీ  మార్చిందని మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వర్ రావు ఆరోపించారు. ఈ విషయమై తమ పార్టీ అభ్యర్ధులు కోర్టును కూడా ఆశ్రయించారని చెప్పారు. అయితే టీడీపీ అభ్యర్ధులు విపరీతంగా డబ్బులు ఖర్చు పెట్టడంతో పాటు తమ పార్టీ క్యాడర్ మధ్య సరైన సమన్వయం లేని కారణంగానే  కొండపల్లిలో కొంత తమకు నష్టం జరిగిందని వైసీపీ ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ అభిప్రాయపడ్డారు. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios