డాక్టర్ సుధాకర్ వాంగ్మూలం రేపటి లోపుగా నమోదు చేయాలి: ఏపీ హైకోర్టు ఆదేశం
డాక్టర్ సుధాకర్ ఆరోగ్యాన్ని పరీక్షించి రేపు సాయంత్రం లోపుగా వాంగ్మూలాన్ని నమోదు చేయాలని ఏపీ హైకోర్టు బుధవారం నాడు ఆదేశించింది.
అమరావతి: డాక్టర్ సుధాకర్ ఆరోగ్యాన్ని పరీక్షించి రేపు సాయంత్రం లోపుగా వాంగ్మూలాన్ని నమోదు చేయాలని ఏపీ హైకోర్టు బుధవారం నాడు ఆదేశించింది.
డాక్టర్ సుధాకర్ రోడ్డుపై పోలీసులు అరెస్ట్ చేసిన ఘటనపై మాజీ ఎమ్మెల్యే అనిత హైకోర్టుకు లేఖ రాసింది.ఈ లేఖను ఏపీ హైకోర్టు విచారణకు స్వీకరించింది. డాక్టర్ సుధాకర్ ఆరోగ్య పరిస్థితిని పరీక్షించిన తర్వాత రేపు సాయంత్రం లోపుగా ఆయన వాంగ్మూలాన్ని నమోదు చేయాలని హైకోర్టు ఆదేశించింది.
విశాఖ జిల్లా సెషన్స్ జడ్జిని జ్యూడిషియల్ విచారణ అధికారిగా నియమించింది హైకోర్టు. విశాఖ జిల్లా సెషన్స్ జడ్జిని డాక్టర్ సుధాకర్ వాంగ్మూలం రికార్డు చేయాలని ఆదేశించింది. ఈ కేసు విచారణను ఈ నెల 22వ తేదీన ఈ కేసు విచారణను చేపట్టనున్నట్టుగా హైకోర్టు ప్రకటించింది.
also read:ఆసుపత్రిలో డాక్టర్ సుధాకర్ ను చూసి కన్నీళ్లు పెట్టుకొన్న తల్లి
మూడు రోజుల క్రితం విశాఖపట్టణంలో అర్ధనగ్నంగా డాక్టర్ సుధాకర్ ప్రత్యక్షమయ్యాడు. మద్యం తాగి రోడ్డుపై డాక్టర్ సుధాకర్ రభస సృష్టించాడని వైద్యులు చెప్పారు. ఈ సమయంలోనే డాక్టర్ సుధాకర్ పై అనుచితంగా వ్యవహరించిన కానిస్టేబుల్ ను సస్పెండ్ చేశారు.
డాక్టర్ సుధాకర్ ప్రస్తుతం విశాఖపట్టణంలోని మానసిక ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. డాక్టర్ సుధాకర్ నెల రోజుల క్రితం కరోనా మాస్కుల విషయమై ఏపీ సీఎం జగన్ ను విమర్శించాడు. దీంతో ఆయనను ప్రభుత్వం సస్పెండ్ చేసింది.