జనసేన కార్యకర్తలపై నమోదైన ఎఫ్ఐఆర్ రద్దుకి హైకోర్టు నిరాకరణ: కౌంటర్ దాఖలుకై ప్రభుత్వానికి ఆదేశం

విశాఖ ఎయిర్  పోర్టులో  మంత్రుల కార్లపై దాడి  జరిగిన ఘటనపై జనసేన కార్యకర్తలపై నమోదైన ఎఫ్ఐఆర్  ను రద్దు చేసేందుకు హైకోర్టు నిరాకరించింది.

 AP High Court Orders government  To File Counter on janasena petition

అమరావతి: విశాఖపట్టణం ఎయిర్ పోర్టులో మంత్రులపై దాడి చేసిన కేసులో జనసేన కార్యకర్తలపై నమోదైన ఎఫ్ఐఆర్ ను  రద్దు  చేసేందుకు ఏపీ హైకోర్టు మంగళవారం నాడు తీర్పు  చెప్పింది. ఈ కేసు విషయమై కౌంటర్ దాఖలు చేయాలని  రాష్ట్ర  ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.నిందితుడు కానీ మూడో వ్యక్తి ఎఫ్ఐఆర్ ను ఎలా సవాల్  చేస్తారని హైకోర్టు ప్రశ్నించింది.కౌంటర్లు దాఖలు చేయాలని  ప్రభుత్వాన్ని ఆదేశించింది  ఏపీ  హైకోర్టు.

జనసేన కార్యకర్తలపై  నమోదైన ఎఫ్ఐఆర్ లను కొట్టివేయాలని కోరుతూ  నిన్న హైకోర్టులో జనసేన పిటిషన్ దాఖలు  చేసింది. ఈ పిటిషన్  పై విచారణ నిర్వహించిన హైకోర్టు  ఈ ఆదేశాలు జారీ  చేసింది.

ఈ  నెల 15న  మూడు రాజధానులకు మద్దతుగా జేఏసీ ఆధ్వర్యంలో విశాఖ గర్జన నిర్వహించారు .ఈ గర్జనకు హాజరౌతున్న మంత్రుల కార్లపై జనసేన  కార్యకర్తలు దాడికి దిగారని వైసీపీ  ఆరోపించింది.  అయితే  ఈ దాడికి  తమకు  సంబంధం లేదని జనసేన ప్రకటించింది.  తమ మంత్రుల కార్లపై  వైసీపీ  శ్రేణులు దాడి  చేసి తమపై ఆరోపణలు చేస్తున్నాయని జనసేన వి మర్శలు చేసింది. 

ఈ ఘటనకు సంబంధించి జనసేన కు చెందిన కార్యకర్తలపై కేసులు నమోదు  చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు .సుమారు వంద మందికి పైగా తమ  పార్టీ శ్రేణుల్ని  పోలీసులు అరెస్ట్  చేశారని  జనసేన చీఫ్  పవన్ కళ్యాణ్   ప్రకటించారు  అక్రమంగా నమోదు చేసిన కేసులను రద్దు  చేయాలని జనసేన హైకోర్టును ఆశ్రయించింది. అయితే ఎఫ్ఐఆర్  ను రద్దు చేసేందుకు మాత్రం  హైకోర్టు నిరాకరించింది.

ఈ  నెల  15న విశాఖ గర్జన పేలవంగా  జరగడంతో  పాటు పవన్  కళ్యాణ్  నిర్వహించిన  ర్యాలీకి  పెద్ద ఎత్తున  మద్దతు రావడంతో  తట్టుకోలేక వైసీపీ  దాడి డ్రామాను ఆడుతున్నారని  జనసేన ఆరోపణలు చేసింది.   పోలీసులను  అడ్డు పెట్టుకొని వైసీపీ తమ కార్యక్రమాలను అడ్డుకొనే  ప్రయత్నం  చేస్తుందని జనసేన ఆరోపణలు చేస్తుంది.

జనసేన  ఆరోపణలను వైసీపీ  తీవ్రంగా ఖండిస్తుంది. విశాఖలో చోటు చేసుకున్న ఘటనల  నేపథ్యంలో  ఈ నెల 16న  నిర్వహించాల్సిన జనవాణిని జనసేన రద్దు చేసుకుంది.  జనసేన కార్యకర్తలు విడుదలైన తర్వాతే ఈ  కార్యక్రమాన్ని నిర్వహిస్తామని  జనసేన ప్రకటించింది.

also read:ప్రాంతాలు, ప్రజల మధ్య చిచ్చు పెట్టడమే వైసీపీ ప్లాన్:పవన్ కళ్యాణ్ ఫైర్

ఎలాంటి  అనుమతి తీసుకోకుండా  కార్యక్రమాలు నిర్వహించవద్దని పోలీసులు జనసేనానికి రెండు  రోజుల క్రితం విశాఖలో  నోటీసులు ఇచ్చారు.దీంతో ఆయన హోటల్ కే పరిమితమయ్యారు. నిన్న మధ్యాహ్నం విశాఖపట్టణం  నుండి  మంగళగిరికి  పవన్  కళ్యాణ్  చేరుకున్నారు.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios