అమరావతి: టీడీపీ చీఫ్ చంద్రబాబునాయుడు విశాఖ పర్యటనలో పోలీసులు వ్యవహరించిన తీరుపై ఏపీ హైకోర్టులో సోమవారం నాడు విచారణ జరిగింది.  సెక్షన్ 151 సీఆర్‌పీసీని ఎలా అమలు చేస్తారో స్వయంగా హైకోర్టుకు హాజరై వివరించాలని  డీజీపీని  ఆదేశించింది హైకోర్టు.

Also read:జగన్‌కు షాక్: రిజర్వేషన్ కోటా జీవోను కొట్టేసిన హైకోర్టు

ఈ ఏడాది ఫిబ్రవరి 27వ తేదీన  ప్రజా చైతన్య యాత్రలో భాగంగా చంద్రబాబునాయుడు విశాఖ పట్టణం టూరుకు వెళ్లారు. చంద్రబాబునాయుడు కాన్వాయ్‌ను వైసీపీ శ్రేణులు ఎయిర్‌పోర్టులోనే అడ్డుకొన్నాయి. సుమారు నాలుగు గంటలకు పైగా  ఎయిర్‌పోర్టులో కారులోనే ఉన్నారు. 

Also read: సెక్షన్ 151 ఎలా ప్రయోగిస్తారు: చంద్రబాబు అరెస్ట్‌పై హైకోర్టు

వైసీపీ శ్రేణులు బాబు కాన్వాయ్‌ను నిలువరిచింది. ప్రజా చైతన్య యాత్రకు విశాఖపట్టణం పోలీసులు అనుమతి ఇచ్చిన విషయాన్ని టీడీపీ నేతలు గుర్తు చేశారు. ఇదే విషయమై టీడీపీకి చెందిన మాజీ ఎమ్మెల్యే శ్రవణ్ కుమార్  ఏపీ హైకోర్టులో   గత నెల 28వ తేదీన లంచ్‌మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ పై ఆరోజున విచారణ చేసిన కోర్టు పోలీసుల తీరుపై  సీరియస్ కామెంట్స్ చేసింది. 

ఈ కేసు విచారణను   సోమవారం నాడు చేసింది హైకోర్టు.  చంద్రబాబునాయుడుకు  సెక్షన్ సీఆర్‌పీసీ 151 కింద నోటీసులు జారీ చేయడాన్ని పిటిషనర్ తరపు న్యాయవాది తప్పుబట్టారు. చట్టప్రకారంగానే సెక్షన్ సీఆర్‌పీసీ కింద నోటీసులు జారీ చేసినట్టుగా అడ్వకేట్ జనరల్ హైకోర్టుకు వివరించారు.

పిటిషనర్ తరపు న్యాయవాది చెబుతున్న అంశాలు  చట్టపరిధిలోకి రావని  ఏజీ హైకోర్టుకు చెప్పారు. సెక్షన్ 151 సీఆర్‌పీసీని ఏ పరిస్థితుల్లో అమలు చేస్తారో చెప్పేందుకు ఏపీ డీజీపీని హైకోర్టు ముందు హాజరు కావాలని  హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ నెల 12వ తేదీన  హాజరుకావాలని  ఏపీ డీజీపీ గౌతం సవాంగ్ ను 
హైకోర్టు ఆదేశించింది. ఈ పిటిషన్ ను మార్చి 12వ తేదీకి వాయిదా వేసింది.