జగన్‌కు షాక్: రిజర్వేషన్ కోటా జీవోను కొట్టేసిన హైకోర్టు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పంచాయితీ ఎన్నికల్లో 59.85 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ జారీ చేసిన జీవోను ఏపీ హైకోర్టు సోమవారం నాడు కొట్టివేసింది. నెలలోపుగా బీసీ రిజ్వేషన్లను ఖరారు చేయాలని ఆదేశించింది.

Ap High court quashes 176 GO in Andhra pradesh

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పంచాయితీ ఎన్నికల్లో 59.85 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ జారీ చేసిన జీవోను ఏపీ హైకోర్టు సోమవారం నాడు కొట్టివేసింది. నెలలోపుగా బీసీ రిజ్వేషన్లను ఖరారు చేయాలని ఆదేశించింది.

ఏపీ రాష్ట్రంలో  పంచాయితీ ఎన్నికల్లో రిజర్వేషన్లను 59.85 శాతం కల్పిస్తూ ప్రభుత్వం జీవో జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ జీవోను నిరసిస్తూ కొందరు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ కేసుపై హైకోర్టు విచారణ చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది.

50 శాతానికిపైగా రిజర్వేషన్లు ఉండడం సుప్రీంకోర్టు ఆదేశాలకు విరుద్దమని హైకోర్టు  ఈ సందర్భంగా గుర్తు చేసింది. కొత్తగా జారీ చేసే రిజర్వేషన్లు కూడ 50 శాతానికి పైగా ఉండకూడదని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.


స్థానిక సంస్థల ఎన్నికల్లో  50 శాతానికి మించిన రిజర్వేషన్లు రాజ్యాంగ విరుద్దమని అనంతపురం జిల్లాకు చెందిన రామాంజనేయులు పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌తో పాటు మరికొన్ని పిటిషన్లు దాఖలయ్యాయి.ఈ పిటిషన్లపై సుప్రీంకోర్టు   ఈ ఏడాది జనవరి 15న విచారించింది.

Also read:జగన్‌కు షాక్: ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల జీవో పై స్టే విధించిన సుప్రీం

స్థానిక సంస్థల ఎన్నికల్లో 50 శాతానికి మించి రిజర్వేషన్లు రాజ్యాంగ విరుద్దమని పిటిషనర్ తరపు న్యాయవాది వాదించారు. అయితే ఈశాన్య రాష్ట్రాల్లో రిజర్వేషన్ల అంశం ఏపీ తరపు ప్రభుత్వ న్యాయవాది వాదించారు.

స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ కోసం విడుదల చేసిన జీవో 176పై సుప్రీంకోర్టు స్టే విధించింది. నాలుగు వారాల్లో ఈ రిజర్వేషన్ల అంశంపై ఏపీ హైకోర్టు విచారణను పూర్తి చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది.  నోటీపికేషన్ విడుదలను నిలిపివేయాలని కూడ సుప్రీంకోర్టు ఆదేశించింది. వాస్తవానికి ఈ ఏడాది జనవరి 17వ తేదీన స్థానిక సంస్థల ఎన్నికలకు నోటీఫికేషన్ విడుదల కావాల్సిన తరుణంలో సుప్రీంకోర్టు జగన్ సర్కార్ కు షాకిచ్చింది.

రాష్ట్ర ఎన్నికల సంఘం ఇచ్చిన అఫిడవిట్‌‌కు హైకోర్టు ఇటీవల ఆమోదముద్ర వేసింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రెండు దశల్లో మండల పరిషత్ ఎన్నికలు, మూడు దశల్లో  గ్రామ పంచాయితీ ఎన్నికలను నిర్వహించనున్నారు. ఈ మేరకు  ఎన్నికల సంఘం సమర్పించిన అఫిడవిట్‌కు ఏపీ రాష్ట్ర హైకోర్టు ఓకే చెప్పింది.

జనవరి 17వ తేదీన ఎంపీటీసీ, జడ్‌పీటీసీ ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్ విడుదల కానుంది. ఫిబ్రవరి 10వ తేదీన  ఎంపీటీసీ, జడ్‌పీటీసీ ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి.   ఇక గ్రామ పంచాయితీ ఎన్నికలను మూడు దశల్లో నిర్వహించాలని తలపెట్టారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఈ కేసు విచారణ చేసిన హైౌకోర్టు ఇవాళ రిజర్వేషన్ల జీవోను కొట్టేసింది. దీంతో కొత్తగా రిజర్వేషన్లు జీవో అమలు చేయాల్సిన పరిస్థితులునెలకొన్నాయి.

 

 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios