Asianet News TeluguAsianet News Telugu

కోర్టు ధిక్కరణ కేసులో ఎమ్మార్వోకు జైలు శిక్ష విధించిన ఏపీ హైకోర్టు

ఆంధ్రప్రదేశ్ హైకోర్టు (Andra Pradesh High Court) ఓ తహసీల్దార్‌కు జైలు శిక్ష విధించింది. కోర్టు ధిక్కరణ కేసులో కర్నూలు జిల్లాలోని సి బెళగల్ ఎమ్మార్వోకు హైకోర్టు జైలు శిక్ష విధించింది.

AP High court order Imprisonment to kurnool c belagal mro
Author
Amaravati, First Published Feb 19, 2022, 5:17 PM IST

ఆంధ్రప్రదేశ్ హైకోర్టు (Andra Pradesh High Court) ఓ తహసీల్దార్‌కు జైలు శిక్ష విధించింది. కోర్టు ధిక్కరణ కేసులో కర్నూలు జిల్లాలోని సి బెళగల్ ఎమ్మార్వోకు హైకోర్టు జైలు శిక్ష విధించింది. ఆరు నెలల జైలు శిక్ష, రూ. 2 వేలు జరిమానా విధిస్తూ తీర్పు నిచ్చింది. మండలంలోని కొత్తకోటలో భూమి మ్యుటేషన్ కోసం ఓ రైతు ఎమ్మార్వోకు దరఖాస్తు చేసుకున్నారు. అయితే రాజకీయ ఒత్తిళ్లతో ఎమ్మార్వో రైతు దరఖాస్తును తిరస్కరించారు. దీంతో ఆ రైతు హైకోర్టును ఆశ్రయించారు. 

దీంతో విచారణ చేపట్టిన హైకోర్టు రైతు భూమిని మ్యుటేషన్ చేయాలని ఆదేశాలు జారీ చేసింది. అయితే ఎమ్మార్వో ఆ పని చేయలేదు. దీంతో కోర్టు ఆదేశాలను పాటించకపోవడంతో ఎమ్మార్వోకు హైకోర్టు శిక్ష విధించింది. కోర్టు ధిక్కరణకు సంబంధించి ఈ తీర్పు వెలువరించింది. 

Follow Us:
Download App:
  • android
  • ios