అమరావతి: ఆంధ్రప్రదేశ్ పోలీసుల తీరుపై హైకోర్టు తీవ్రంగా మండిపడింది. ప్రభుత్వం, పోలీసు తరపు న్యాయవాదులు హైకోర్టునే బెదిరిస్తున్నారని వ్యాఖ్యానించింది. రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కులను హరిస్తూ పోలీసులు వ్యక్తులను ఎత్తుకెళ్లి నిర్బంధించడం సాధారణ విషయమేనా అని ప్రశ్నించింది. వ్యక్తిగత స్వేచ్ఛను హరించడం, సీఆర్పీసీ నిబంధనలను ఉల్లంఘించడం పోలీసులకు సాధారణ విషయం కావచ్చునేమో గానీ కోర్టుకు కాదని వ్యాఖ్యానించింది. 

ఓ వ్యక్తిని వారం రోజుల పాటు నిర్బంధించి చిత్రహింసలు పెట్టారని, హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన తర్వాతనే విడుదల చేశారని గుర్తు చేస్తూ పౌరుల హక్కులకు రక్షణ కల్పించలేనప్పుడు తాము ఉండి ఓం ప్రయోజమని హైకోర్టు అడిగింది. 

ఆ విషయంపైనే సోమవారం జరిగిన విచారణలో ప్రభుత్వ, పోలీసు తరఫు న్యాయవాదులు కోర్టును బెదిరించారని వ్యాఖ్యానించింది. వ్యక్తులను పోలీసులు అక్రమంగా నిర్బంధించారని ఆరోపిస్తూ దాఖలైన పలు హెబియస్ కార్పస్ పిటిషన్లతో పాటు ప్రతిపక్షాల నిరసన కార్యక్రమాలకు అనుమతి నిరాకరిస్తూ ఇబ్బంది పెడుతున్నారని టీడీపీ మాజీ ఎమ్మెల్యే శ్రావణ్ కుమార్ దాఖలు చేసిన పిల్ మీద హైకోర్టు బుధవారం విచారణ కొనసాగించింది. 

రాష్ట్రంలో రాజ్యాంగ విచ్ఛిన్నం జరిగిందో లేదో తేలుస్తామని, ఈ దిశగా వాదనలను వినిపించాలని అక్టోబర్ 1వ తేదీన హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. బుధవారం విచారణ ప్రారంభమైన వెంటనే పోలీసుల తరఫు న్యాయవాది ఎస్ఎస్ ప్రసాద్ తెలంగాణ హైకోర్టులో కేసు విచారణలో ఉందని, పిటిషన్ మీద వాదనలు వినిపించడానికి కొంత సమయం కావాలని కోర్టును కోరారు. అందుకు హైకోర్టు అంగీకరించింది. 

రాజ్యాంగ విచ్ఛిన్నం జరిగిందా, లేదా అనే విషయం తేల్చే విచారణాధిక పరిధి కోర్టుకు లేదని ఈ నెల 14వ తేీదన జరిగిన విచారణలో అడ్వకేట్ జనరల్ కోర్టు దృష్టికి తెచ్చారని ప్రభుత్వ తరఫు న్యాయవాది ెచప్పారు.