ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలు: జగన్ సర్కార్‌కి హైకోర్టు కీలక ఆదేశాలు

ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై హైకోర్టు బుధవారం నాడు కీలక ఆదేశాలిచ్చింది.రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ ను ముగ్గురు  అధికారులు కలవాలని హైకోర్టు సూచించింది. ఎన్నికల నిర్వహణ గురించి ఎస్ఈసీ నిర్ణయం తెలుపుతోందని హైకోర్టు స్పష్టం చేసింది.
 
AP High court key orders to AP government over local body elections lns

ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై హైకోర్టు బుధవారం నాడు కీలక ఆదేశాలిచ్చింది.రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ ను ముగ్గురు  అధికారులు కలవాలని హైకోర్టు సూచించింది. ఎన్నికల నిర్వహణ గురించి ఎస్ఈసీ నిర్ణయం తెలుపుతోందని హైకోర్టు స్పష్టం చేసింది.

ఈ అంశానికి సంబంధించి ఈ నెల 29వ తేదీన ఆదేశాలు జారీ చేయనుంది హైకోర్టు.వచ్చే ఏడాది ఫిబ్రవరి మాసంలో  స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహణకు రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రయత్నాలు చేస్తోంది. అయితే ఫిబ్రవరిలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు తాము సిద్దంగా లేమని ఏపీ ప్రభుత్వం స్పష్టం చేసింది.

స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు సంబంధించి హైకోర్టు ఆదేశాలను ప్రభుత్వం ధిక్కరించిందని ఆరోపిస్తూ ఏపీ ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్  ఇటీవలనే కోర్టు ధిక్కరణ పిటిషన్ దాఖలు చేశారు.

స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు సంబంధించి దాఖలైన పిటిషన్ పై విచారణ జరిపిన ఏపీ హైకోర్టు జగన్ సర్కార్ ఇవాళ కీలక ఆదేశాలు జారీ చేసింది.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios