Asianet News TeluguAsianet News Telugu

రుషికొండ‌ తవ్వకాలపై విచారణ.. తామే కమిటీని నియమిస్తామన్న హైకోర్టు.. కీలక కామెంట్స్..

విశాఖపట్నంలోని రుషికొండ తవ్వకాల అంశంపై టీడీపీ ఎమ్మెల్యే రామకృష్ణబాబు, జనసేన కార్పొరేటర్ మూర్తియాదవ్‌ దాఖలు చేసిన పిటిషన్‌లపై హైకోర్టు‌లో బుధవారం జరిపింది. విచారణ సందర్భంగా హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది.

AP High court key comments on Rushikonda digging
Author
First Published Dec 21, 2022, 2:50 PM IST

విశాఖపట్నంలోని రుషికొండ తవ్వకాల అంశంపై టీడీపీ ఎమ్మెల్యే రామకృష్ణబాబు, జనసేన కార్పొరేటర్ మూర్తియాదవ్‌ దాఖలు చేసిన పిటిషన్‌లపై హైకోర్టు‌లో బుధవారం జరిపింది. విచారణ సందర్భంగా హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. అక్రమ తవ్వకాలపై నిగ్గు తేల్చేందుకు హైకోర్టు ఆదేశాల మేరకు కేంద్రం వేసిన కమిటీలో ముగ్గురు రాష్ట్ర ప్రభుత్వ అధికారులను నియమించించడం పిటిషనర్ల తరపు న్యాయవాదులు గత విచారణ సందర్భంగా అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ నియామకాలు కోర్టు ఆదేశాలకు విరుద్దంగా ఉన్నాయని అన్నారు.. ఈ క్రమంలోనే అఫిడవిట్ దాఖలు చేయాలని కేంద్రాన్ని గతంలోనే హైకోర్టు ఆదేశించింది. 

దీంతో ఏపీ ప్రభుత్వ అధికారులు నియామకాన్ని సమర్ధిస్తూ కేంద్రం ఆఫిడవిట్ దాఖలు చేసింది. ఈ క్రమంలోనే రాష్ట్రంతో కేంద్రం చేతులు కలిపినట్టుగా కనిపిస్తోందని హైకోర్టు తీవ్ర వ్యాఖ్యలు చేసింది. పిటిషనర్ల అభ్యంతరాలను ఎందుకు పరిగణనలోకి తీసుకోలేదని కేంద్ర ప్రభుత్వ న్యాయవాదిని హైకోర్టు ప్రశ్నించింది. ఈ క్రమంలోనే పిటిషన్‌పై విచారణ జరిపి తామే కమిటీని నియమిస్తామని హైకోర్టు పేర్కొంది. 

కేంద్రం ఏర్పాటు చేసిన కమిటీపై అభ్యంతరాలను వ్యక్తం చేస్తూ అఫిడవిట్ దాఖలు చేయాలని పిటిషనర్ల తరపు న్యాయవాదులను హైకోర్టు ఆదేశించింది. ఇందుకు సంబంధించి తదుపరి విచారణను రేపటికి వాయిదా వేసింది. 

Follow Us:
Download App:
  • android
  • ios