అమరావతి: మిషన్ బిల్డ్ కేసులో ఏపీ హైకోర్టు బుధవారం నాడు కీలక వ్యాఖ్యలు చేసింది. బిల్డ్ ఏపీ అధికారి ప్రవీణ్ కుమార్ తప్పుడు అఫిడవిట్ న్యాయస్థానానికి సమర్పించడంపై హైకోర్టు అసహనం వ్యక్తం చేసింది.

కోర్టు ధిక్కారం అభియోగం కింద మిషన్ బిల్డ్ అధికారి ప్రవీణ్ కుమార్ కు నోటీసులు జారీ చేసింది.  రెండు వారాల్లో దీనికి సమాధానం ఇవ్వాలని కూడ హైకోర్టు ఆదేశించింది.అంతేకాదు క్రిమినల్  ప్రాసిక్యూషన్ కింద కేసు దాఖలు చేయాలని కోర్టు  ఆదేశించింది.

న్యాయ ప్రక్రియలో ప్రభుత్వం జోక్యం చేసుకోవడం వల్లే ఈ పరిస్థితి చోటు చేసుకొందని హైకోర్టు వ్యాఖ్యానించింది.  రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన రిక్విజల్ పిటిషన్ ను ఏపీ హైకోర్టు తోసిపుచ్చింది.

also read:అప్పటి వరకు టెండర్లొద్దు: ప్రభుత్వ ఆస్తుల అమ్మకాలపై ఏపీ హైకోర్టు

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రంలోని ప్రభుత్వ భూములను విక్రయించాలని తలపెట్టింది.ఈ మేరకు మిషన్ బిల్డ్ సంస్థను ఏర్పాటు చేసింది.

ప్రభుత్వ భూముల విక్రయాన్ని నిరసిస్తూ పలువురు ఏపీ హైకోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి.ఈ పిటిషన్లపై ఏపీ హైకోర్టు విచారణ సాగిస్తోంది.