Asianet News TeluguAsianet News Telugu

మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్‌పై హైకోర్టు కీలక ఆదేశాలు

గతేడాది జారీచేసిన మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషనే ఎస్ఈసీ కొనసాగించడాన్ని సవాల్ చేస్తూ దాఖలయిన పిటిషన్ పై  హైకోర్టు  కీలక ఆదేశాలు జారీ చేసింది.  

AP High Court Judgement on Municipal Eection Notification
Author
Amaravathi, First Published Mar 2, 2021, 4:55 PM IST

అమరావతి: పురపాలక సంఘాల ఎన్నికలకు తాజా నోటిఫికేషన్‌ ఇవ్వాలని కోరుతూ దాఖలైన రిట్‌ అప్పీల్స్‌ను హైకోర్టు ధర్మాసనం కొట్టివేసింది. మంగళవారం హైకోర్టు ముందుకు ఈ పిటిషన్ విచారణకు రాగా.. సంవత్సరం క్రితం ఇచ్చిన నోటిఫికేషన్‌ను ఇప్పుడు కొనసాగించటం నిబంధనలకు విరద్ధమని పిటిషనర్లు పేర్కొన్నారు. కోవిడ్‌ వలన సామాజిక మార్పులు జరిగాయని వాదనలు వినిపించారు. ఇరు వర్గాల వాదనలు విన్న అనంతరం రిట్‌ అప్పీల్స్‌ను హైకోర్టు కొట్టివేసింది. ఎన్నికలు యథావిధిగా జరుగుతాయని తెలిపింది.  

ఇక వార్డు వాలంటీర్లను మున్సిపల్ ఎన్నికలకు దూరంగా వుంచాలన్న ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ ఆదేశాలపై తీర్పును రిజర్వ్ చేసింది హైకోర్టు. వార్డ్ వాలంటీర్ల వద్దనున్న ట్యాబ్‌లను స్వాధీనం చేసుకోవాలన్న ఆదేశాలపై ఏపీ ప్రభుత్వం న్యాయస్థానంలో హౌజ్ మోషన్ పిటిషన్ దాఖలు చేసింది. వాలంటీర్లు పెన్షన్లు, ప్రభుత్వ పథకాల అమలులో పాల్గొనకపోతే లబ్ధిదారులు తీవ్ర్ ఇబ్బందులను ఎదుర్కొంటారని ఏపీ ప్రభుత్వం న్యాయస్థానం దృష్టికి తీసుకొచ్చింది. దీనిపై ఇరు పక్షాల వాదనలు విన్న హైకోర్టు తీర్పును రిజర్వ్ చేసింది. 

read more   ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు: కౌంటర్ దాఖలు చేయాలని ఎస్ఈసీకి ఏపీ హైకోర్టు ఆదేశం

కాగా మున్సిపల్ ఎన్నికల్లోను వాలంటీర్ల సేవల వినియోగం ఉండదని నిమ్మగడ్డ చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికలు పూర్తయ్యే వరకు వాలంటీర్ల కదలికలపై దృష్టి పెట్టనున్నట్లు తెలిపారు. పంచాయతీ ఎన్నికల్లో వాలంటీర్ల పాత్రలపై పలు అనుమానాలు తలెత్తాయని వ్యాఖ్యానించారు. విపక్ష పార్టీలన్నీ వాలంటీర్లే దగ్గరి నుంచి అధికార పక్షానికి సహకరించారని ఫిర్యాదులు చేశాయని ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ తెలిపారు. అందువల్లే ఎన్నికల ప్రక్రియలో వార్డు వాలంటీర్లు ప్రత్యక్షంగా, పరోక్షంగా పాల్గొనకూడదని ఆదేశాలిచ్చినట్లు నిమ్మగడ్డ రమేష్ కుమార్ తెలిపారు.

Follow Us:
Download App:
  • android
  • ios