అమరావతి: ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల నోటిఫికేషన్ ను రద్దు చేయాలని  దాఖలైన పిటిషన్లపై కౌంటర్ దాఖలు చేయాలని ఏపీ రాష్ట్ర ఎన్నికల సంఘానికి ఏపీ హైకోర్టు ఆదేశించింది.

ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల నోటిఫికేషన్ ను రద్దు చేయాలని కోరుతూ జనసేన సహా 10 పిటిషన్లు దాఖలయ్యాయి. ఈ పిటిషన్లను సోమవారం నాడు  ఏపీ హైకోర్టు విచారించింది.

ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల నోటిఫికేషన్ ను రద్దు చేయాలని  కోరుతూ జనసేన పిటిషన్ దాఖలు చేసింది. మరో వైపు ఇదే తరహా మరో 10 పిటిషన్లు దాఖలయ్యాయి. ఈ పిటిషన్లను కలిపి  ఏపీ హైకోర్టు విచారణ చేసింది.

ఏకగ్రీవంగా ఎన్నికైన స్థానిక సంస్థల్లో పామ్ 10 దాఖలు చేస్తే  సరిపోతోంది. లేకపోతే వాటిని అనర్హులుగా ప్రకటించాలని గతంలో హైకోర్టు ఆదేశించింది. ఫామ్ 10 దాఖలు చేయని ఫలితాలను రద్దు చేయాలని హైకోర్టు ఆదేశించింది.