గనుల అక్రమ తవ్వకాలకు సంబంధించి గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి ఏపీ హైకోర్టు నోటీసులు జారీ చేసింది. ల్లభనేనితో పాటు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, గనుల శాఖ అధికారులకు కూడా హైకోర్టు నోటీసులు ఇచ్చింది. 

టీడీపీ నుంచి వైసీపీలో చేరిన గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మోహన్‌కు ఏపీ హైకోర్టు షాకిచ్చింది. గనుల అక్రమ తవ్వకాలకు పాల్పడ్డారంటూ దాఖలైన పిటిషన్‌ను విచారించిన ధర్మాసనం.. వంశీకి నోటీసులు జారీ చేసింది. వల్లభనేనితో పాటు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, గనుల శాఖ అధికారులకు కూడా హైకోర్టు నోటీసులు ఇచ్చింది. అనంతరం తదుపరి విచారణను న్యాయస్థానం 8 వారాలకు వాయిదా వేసింది.

ఇకపోతే.. గన్నవరం వైసీపీలో మరోసారి వర్గ విభేదాలు చోటు చేసుకున్నాయి. ఎమ్మెల్యే వల్లభనేని వంశీ , యార్లగడ్డ వెంకట్రావు వర్గాలు బాహాబాహీ తలపడ్డాయి. ఇరువర్గాల మధ్య పరస్పర దాడులు జరిగాయి. వరలక్ష్మీ వ్రతం సందర్భంగా ప్రభల వేడుకల ఊరేగింపులో వివాదం చోటు చేసుకున్నట్లుగా తెలుస్తోంది. వల్లభనేని వంశీ ఆఫీసు ఎదురుగా ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. అయితే యార్లగడ్డ వర్గీయులే దాడి చేశారని వంశీ వర్గాలు ఆరోపించుకున్నాయి. తమను కవ్విస్తూ గొడవకు దిగారని చెబుతున్నారు.

Also REad:గన్నవరం వైసీపీలో మళ్లీ భగ్గుమన్న విభేదాలు... వల్లభనేని ఆఫీసు వద్ద వంశీ- యార్లగడ్డ వర్గాల ఘర్షణ

కాగా... టీడీపీ నుంచి గెలిచిన వల్లభనేని వంశీ మోహన్ వైఎస్ఆర్‌సీపీలో చేరడాన్ని యార్లగడ్డ వెంకట్రావుతో పాటు అత‌ని అనుచ‌ర వ‌ర్గం ముందు నుంచి వ్యతిరేకిస్తున్నారు. వారిలో నెల‌కొన్న అసమ్మతిని బ‌హిరంగంగానే వెళ్లగక్కుతున్నారు. యార్ల‌గ‌డ్డ‌ ముందు ఉండే.. వంశీతో కలిసి పనిచేసేది లేదని బాహాటంగా ప్ర‌క‌టించిన విష‌యం తెలిసిందే. దీంతో గన్నవరం అధికార వైసీపీలో వ‌ర్గ‌పోరు రోజు రోజుకీ ముదురుతోంది