మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడికి ఏపీ హైకోర్టు సోమవారం నాడు ఊరట లభించింది.  అరెస్ట్ చేయవద్దని మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. తదుపరి విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది.

 అయ్యన్నపాత్రుడు దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ పై ఏపీ హైకోర్టు ఇవాళ విచారణ చేసింది. ఈ పిటిషన్ పై అరెస్ట్ చేయవద్దని హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.

also read:అయ్యన్నపాత్రుడి అరెస్టుకు రంగంలోకి దిగిన పోలీసులు

మహిళా ఎమ్మార్వోను దూషించిన కేసులో అయ్యన్నపాత్రుడిని అరెస్ట్ చేయాలని పోలీసులు రంగం సిద్దం చేశారు. ఇవాళ ఉదయం నుండి అయ్యన్నపాత్రుడి కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. అయితే ఆయన ఫోన్ కూడ స్విఛ్ఛాప్ చేసి ఉంది.

ఇటీవలనే నర్సీపట్నం మున్సిపల్ కమిషనర్ ను కూడ అయ్యన్నపాత్రుడు దూషించారని కేసు  నమోదైంది. మున్సిఫల్ కమిషనర్ కృష్ణవేణి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే.మున్సిఫల్ కమిషనర్ ను దూషించిన కేసులో అయ్యన్నపాత్రుడిని అరెస్ట్ చేయాలని వైసీపీ నేతలు డిమాండ్ చేశారు.

అయ్యన్నపాత్రుడిని కలిసి వచ్చిన తర్వాతే డాక్టర్ సుధాకర్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారని కూడ ఆరోపణలు వచ్చాయి. అయితే ఆ సమయంలో డాక్టర్ సుధాకర్ తనను కలవలేదని ఆయన వివరణ ఇచ్చారు. 

డాక్టర్ సుధాకర్ కేసుతో పాటు అచ్చెన్నాయుడు అరెస్ట్ వ్యవహారాలు చోటు చేసుకొన్న సమయంలో ప్రభుత్వంపై అయ్యన్నపాత్రుడు ఒంటికాలిపై విమర్శలు గుప్పించారు.