Asianet News TeluguAsianet News Telugu

ఫీజుల నియంత్రణ కోసం ఏం చేశారు: విద్యాశాఖను నిలదీసిన హైకోర్టు

ఫీజుల నియంత్రణపై దాఖలయిన పిటిషన్లపై ఏపీ హైకోర్టు లో మంగళవారం విచారణ జరిపింది.

AP High Court inquiry on fees regulation
Author
Amaravathi, First Published Sep 1, 2020, 7:47 PM IST

అమరావతి: ఫీజుల నియంత్రణపై దాఖలయిన పిటిషన్లపై ఏపీ హైకోర్టు లో మంగళవారం విచారణ జరిపింది. జీవో నెంబర్ 46 ఉల్లంఘనలపై 18లోగా వివరణ ఇవ్వాలంటూ రాష్ట్ర విద్యాశాఖ ను న్యాయస్థానం ఆదేశించింది. ఇప్పటివరకు అధిక ఫీజుల వసూళ్లపై ఎన్ని ఫిర్యాదులు స్వీకరించారు... ఎన్ని స్కూళ్లకు నోటీసులు ఇచ్చారు, ఎన్ని స్కూళ్లు పై చర్యలు తీసుకున్నారో తెలపాలని న్యాయస్థానం విద్యాశాఖను ఆదేశించింది. 

ఇదివరకే ఇంజనీరింగ్ కాలేజీల్లో ఫీజు నియంత్రణ విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి హైకోర్టు మరో షాక్ ఇచ్చిన విషయం తెలిసిందే. ఫీజుల నియంత్రణకు సంబంధించి ప్రభుత్వమిచ్చిన జీవో 15ను సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్ పై హైకోర్టు స్టే ఇవ్వగా ఈ స్టేను ఎత్తివేయాలని ప్రభుత్వం వేసిన వెకేట్ పిటిషన్ ను కూడా హైకోర్టు తోసిపుచ్చింది.

read more  డాక్టర్ సుధాకర్ కేసులో కుట్రకోణం: హైకోర్టులో సిబిఐ వాదన  

రాష్ట్రంలోని ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీలు ప్రభుత్వ నిబంధనలను విస్మరించి అధిక ఫీజులు వసూలు చేయడంపై వైసిపి ప్రభుత్వం చర్యలు తీసుకుంది. ఫీజుల పర్యవేక్షణ, నియంత్రణకు సంబంధించిని విదివిధాలను రూపొందించిన జగన్ సర్కార్ జీవో 15ను జారీ చేసింది.  

అయితే ఈ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీల యాజమాన్యాలు హైకోర్టును ఆశ్రయించాయి. దీంతో ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయస్థానం కొంతకాలం ఈ జీవోపై స్టే విధించింది. తాజాగా ఈ స్టేను ఎత్తివేయాలని ప్రభుత్వం దాఖలుచేసిన వెకేట్ పిటిషన్ పై విచారణ జరిపిన న్యాయస్థానం  దీన్ని తోసిపుచ్చింది.   
 

Follow Us:
Download App:
  • android
  • ios