Asianet News TeluguAsianet News Telugu

డాక్టర్ సుధాకర్ కేసులో కుట్రకోణం: హైకోర్టులో సిబిఐ వాదన

డాక్టర్ సుధాకర్ కేసులో కుట్రకోణం దాగిఉందని సీబీఐ హైకోర్టుకు తెలిపింది.

AP High Court Inquiry CBI Case on Doctor Sudhakar
Author
Amaravathi, First Published Sep 1, 2020, 1:02 PM IST

అమరావతి: విశాఖ డాక్టర్ సుధాకర్ సిబిఐ కేసుపై హైకోర్టు మంగళవారం విచారణ జరిపింది. అయితే డాక్టర్ సుధాకర్ కేసులో కుట్రకోణం దాగిఉందని సీబీఐ కోర్టుకు తెలిపింది. ఈ కుట్రకోణం చేధించేందుకు మరో నెలరోజులపాటు సమయం కోరింది సిబిఐ. 

దీంతో నవంబర్ 11వ తేధీన ఈ కేసుకు సంబంధించిన ఫైనల్ రిపోర్ట్ ను  అందజేయాలని ధర్మాసనం ఆదేశించింది. నవంబర్ 16 కు విచారణను వాయిదా వేసింది రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం. 

లాక్ డౌన్ ఉల్లంఘనలకు పాల్పడినందుకు, బాధ్యత కలిగిన ఓ ప్రభుత్వ ఉద్యోగంలో ఉండి ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించినందుకు డాక్టర్ సుధాకర్ మీద సిబిఐ కేసు నమోదు చేసింది. సుధాకర్ మీద 188, 357 సెక్షన్ల కింద ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు   సీబీఐ ఎస్పీ విమలా ఆదిత్య గతంలోనే తెలిపారు. కేసు వివరాలను సిబిఐ వెబ్ సైట్లో పొందుపరిచినట్లు తెలిపారు. 

read more  విశాఖ డాక్టర్ సుధాకర్ కేసులో మరో ట్విస్ట్.. పదే పదే పోలీస్ స్టేషన్‌కు వెళ్లి!

విశాఖపట్నంలో నడిరోడ్డుపై ఆందోళనకు దిగిన సుధాకర్ ను పోలీసులు అదుపులోకి తీసుకుని ఆస్పత్రికి తరలించిన పరిణామాలపై  టీడీపీ మాజీ ఎమ్మెల్యే వంగలపూడి అనిత రాసిన లేఖను, పంపించిన వీడియోను సుమోటో పిల్ గా పరిగణించి హైకోర్టు కేసు విచారణను సిబిఐకి అప్పగించింది.

 ఇదిలావుంటే, ట్రాఫిక్ కు విఘాతం కలిగిస్తున్నారనే ఆరోపణపై డాక్టర్ సుధాకర్ మీద కేసు నమోదు చేసినట్లు విశాఖపట్నం ఈస్ట్ ఏసీపీ కులశేఖర్ తెలిపారు. అయితే ఘటన జరిగినప్పుడు ఆయన డాక్టర్ సుధాకర్ అనే విషయం పోలీసులకు తెలియదని ఎసీపీ చెప్పారు. 

read more  పిచ్చివాడిగా ముద్రవేసి చంపాలనుకొన్నారు: డాక్టర్ సుధాకర్ సంచలనం

మద్యం సేవించిన వ్యక్తి అక్కయ్యపాలెం పోర్టు ఆస్పత్రి వద్ద ట్రాఫిక్ కు అంతరాయం కలిగిస్తున్నారంటూ వచ్చిన సమాచారం మేరకు ట్రాఫిక్ పోలీసులు అక్కడికి వెళ్లారని, వారిపై సుధాకర్ తిరగబడ్డారని ఆయన చెప్పారు. అంతేకాకుండా పోలీసులనే కాకుండా ముఖ్యమంత్రిని, ప్రధాన మంత్రిని దుర్భాషలాడారని, బెదిరించారని ఆయన వివరించారు. హోంగార్డు చేతిలోని సెల్ ఫోన్ ను ధ్వంసం చేశారని, తనను గాయపరుచుకున్నాడని ఆయన వివరించారు. దాంతో నాలుగో పట్టణం పోలీసు స్టేషన్ కు తరలించి కేసు నమోదు చేశామని చెప్పారు. 

 ఆ సమయంలో మద్యం మత్తులో ఉన్నట్లు అనిపించడంతో నిర్దారణ కోసం కేజీహెచ్ కు పంపించామని, అక్కడి వైద్యుల సలహాల మేరకు మానసిక వైద్యశాలకు పంపించామని ఎసీపీ చెప్పారు. అంతకు మించి తమకు ఈ వ్యవహారంలో ఏ విధమైన సంబంధం లేదని కులశేఖర్ చెప్పారు. 


 

Follow Us:
Download App:
  • android
  • ios