అమరావతి నుంచి రాజధానిని తరలించడాన్ని వ్యతిరేకిస్తూ దాఖలైన పిటిషన్‌పై ఏపీ హైకోర్టులో బుధవారం విచారణ జరిగింది. రైతుల తరపున సీనియర్ అడ్వకేట్‌ అశోక్ భాను వాదనలు వినిపించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రజల ఆకాంక్షలను అణిచివేసే ధోరణిలో వ్యవహరిస్తోందని, రాజ్యాంగ సూత్రాలకు విరుద్ధంగా ఈ బిల్లు తెచ్చారని ఆయన వాదించారు.

ఇది మనీ బిల్లు కాదని ప్రభుత్వం కోర్టులో ఒప్పుకుందని, రైతుల న్యాయబద్ధమైన ఆకాంక్షలకు విఘాతం కలిగించే విధంగా ఈ బిల్లు ఉందని అశోక్ తెలిపారు. న్యాయ సమీక్షా విధానంలో సమాజహితానికి భంగం కలిగే విధానాలను అడ్డుకునే అధికారం కోర్టుకు ఉందని ఆయన న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్లారు. 

Also Read:మూడు రాజధానులు: హైకోర్టు తలుపు తట్టిన అమరావతి రైతులు

మరోవైపు అమరావతి పరిధిలో గల గ్రామాల్లో విధించిన పోలీసుల ఆంక్షలపై హైకోర్టులో విచారణ వాయిదా పడింది. కాగా ఏపి రాజధాని అమరావతి పరిధిలోని గ్రామాల్లో 144 సెక్షన్, పోలీస్ యాక్ట్ 30 విధించడాన్ని వ్యతిరేకిస్తూ దాఖలైన పిటిషన్లపై హైకోర్టు విచారణ చేపట్టిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా రాజధానిలో కఠినమైన సెక్షన్లను విధించడంపైనా, మహిళలపై దాడుల అంశాన్ని కూడా న్యాయస్థానం ప్రస్తావించింది

ముఖ్యమంత్రి వైస్ జగన్ మూడు రాజధానులపై అమరావతి రైతులు హైకోర్టు తలుపులు తట్టారు. ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతిని కొనసాగించాలని కోరుతూ వారు ఆ పిటిషన్ దాఖలు చేశారు. ఆ పిటిషన్ బుధవారం మధ్యాహ్నం విచారణకు జరగనుంది. 37 మంది రైతులు ఆ పిటిషన్ దాఖలు చేశారు.

సీఆర్డీఎ రద్దుపై మరో హైకోర్టులో మరో పిటిషన్ దాఖలైంది. కాగా, అమరావతి రైతుల ఆందోళన బుధవారంనాటికి 36వ రోజుకు చేరుకుంది.  అమరావతి ఏజేసి పిలుపు మేరకు రాజధాని గ్రామాల్లో సంపూర్ణ బంద్ వాతావరణం నెలకొంది. వర్తకులు స్వచ్ఛందంగా  దుకాణాలు మూసివేశారు. వర్తకులుతుళ్లూరు మండలంలో అన్ని గ్రామాలు పోలీస్ల ఆధీనంలో ఉన్నాయి, 

Also Read:రూల్‌ నెం 71పై ఓటింగ్: టీడీపీ నెగ్గింది, కానీ ఇద్దరు ఎమ్మెల్సీల షాక్

సచివాలయం పరిసర ప్రాంతాలలో పశువులు మేపుకునే వారిని కూడా పోలీసులు అనుమతించడం లేదు. ప్రధాన కూడళ్ళలో ముళ్ళ కంచెలను పోలీసులు అందుబాటులో ఉంచారు.144 సెక్షన్, పోలీస్ చట్టం 30 అమలులో ఉన్నాయి.

29 గ్రామాల్లో బహిరంగ నిరసనలకు, ధర్నాలకు అనుమతి లేదు. రోడ్లపై జనాలను గుంపులుగా ఉండనివ్వడం లేదు.  ఇదిలావుంటే, మండలిలో వికేంద్రీకరణ బిల్లు ఆమోదం లభించకపోవడంతో రైతుల్లో ఉత్సాహం నెలకొన్నది.