Asianet News TeluguAsianet News Telugu

రూల్‌ నెం 71పై ఓటింగ్: టీడీపీ నెగ్గింది, కానీ ఇద్దరు ఎమ్మెల్సీల షాక్

రూల్ నెం.71పై ఓటింగ్ సందర్భంగా తెలుగుదేశ పార్టీకి శాసనమండలిలో ఇద్దరు ఎమ్మెల్సీలు హ్యాండిచ్చారు. ఆంధ్రప్రదేశ్ పరిపాలనా వికేంద్రీకరణ బిల్లుకు వ్యతిరేకంగా టీడీపీ ఇచ్చిన రూల్ నెం 71పై జరిగిన ఓటింగ్‌లో అనుకూలంగా 27 మంది, వ్యతిరేకంగా 11 మంది ఓట్లు వేయగా, తొమ్మిది మంది తటస్థంగా వ్యవహారించారు.

2 tdp mlc's voted against on rule no.71 notice in ap legislative council
Author
Amaravathi, First Published Jan 21, 2020, 10:11 PM IST

రూల్ నెం.71పై ఓటింగ్ సందర్భంగా తెలుగుదేశ పార్టీకి శాసనమండలిలో ఇద్దరు ఎమ్మెల్సీలు హ్యాండిచ్చారు. ఆంధ్రప్రదేశ్ పరిపాలనా వికేంద్రీకరణ బిల్లుకు వ్యతిరేకంగా టీడీపీ ఇచ్చిన రూల్ నెం 71పై జరిగిన ఓటింగ్‌లో అనుకూలంగా 27 మంది, వ్యతిరేకంగా 11 మంది ఓట్లు వేయగా, తొమ్మిది మంది తటస్థంగా వ్యవహారించారు.

కాగా పోతుల సునీత, శివనాథ్ రెడ్డిలు వ్యతిరేకంగా ఓటేసి టీడీపీ హైకమాండ్‌కు షాకిచ్చారు. ఓటింగ్ అనంతరం శాసనమండలిని రేపటికి వాయిదా వేస్తున్నట్లు ఛైర్మన్ ప్రకటించారు. ఎట్టకేలకు రూల్ నెం.71పై జరిగిన ఓటింగ్‌లో తెలుగుదేశం పార్టీ విజయం సాధించింది. బుధవారం వికేంద్రీకరణ బిల్లు, సీఆర్‌డీఏ రద్దు బిల్లుపై మండలిలో చర్చ జరగనుంది. 

Also Read:మండలిలో టీడీపీ పట్టు: రూల్ 71 అంటే ఏమిటీ?

ఆంధ్రప్రదేశ్ పరిపాలనా వికేంద్రీకరణ, సీఆర్‌డీఏ రద్దుకు సంబంధించిన బిల్లులను శాసనమండలి ఛైర్మన్ ఎట్టకేలకు పరిగణనలోనికి తీసుకున్నారు. రూల్ 71 కింద చర్చ ప్రారంభించాలంటూ టీడీపీ సభ్యులు నినాదాలు చేయడంతో మండలిలో గందరగోళం నెలకొంది.

అంతకుముందు తొలుత రూల్ 71పై చర్చ జరిపి మిగిలిన అంశాలలోకి వెళ్లాలని తెలుగుదేశం పార్టీ సభ్యులు డిమాండ్ చేశారు. దీనిపై తీవ్ర అభ్యంతరం తెలిపిన వైసీపీ సభ్యులు.. ఇది సభా సాంప్రదాయానికి విరుద్ధమని, ప్రభుత్వం తీసుకొచ్చిన బిల్లులపై మొదట చర్చ చేపట్టాలని పట్టుబట్టారు.

Also Read:రూల్ 71: బుగ్గన ఆ ప్రతిపాదన ఎందుకు చేశారు

టీడీపీకి సంఖ్యాబలం ఉండటంతో రూల్ 71 కింద చర్చ జరిపేందుకు ఛైర్మన్ షరీఫ్ అనుమతిచ్చారు. టీడీపీ ఎమ్మెల్సీ రాజేంద్రప్రసాద్ చర్చను ప్రారంభించగా వైసీపీ సభ్యులు అడ్డుకున్నారు.

మంత్రులు స్వయంగా ఛైర్మన్ పోడియం వద్దకు వెళ్లి ప్రభుత్వం తీసుకొచ్చిన బిల్లులపై చర్చించాలని నినాదాలు చేశారు. టీడీపీ చెప్పినట్లుగా ఛైర్మన్ నడుచుకోవడం సరికాదని అభ్యంతరం వ్యక్తం చేశారు మంత్రి బొత్స. 

Follow Us:
Download App:
  • android
  • ios