Asianet News TeluguAsianet News Telugu

డివిజన్ బెంచ్‌ నుండి సీజే బెంచ్‌కి: పీఆర్సీ జీవోపై హైకోర్టు కీలక ఆదేశాలు

పీఆర్సీ విషయమై గెజిటెడ్ ఆఫీసర్స్ అసోసియేషన్ దాఖలు చేసిన పిటిషన్ ను చీఫ్ జస్టిస్ బెంచ్ విచారణ చేయాలని  డివిజన్ చెంచ్ అభిప్రాయపడింది. ఈ మేరకు ఈ పిటిషన్ ను సీజే బెంచ్ కు పంపుతామని డివిజన్ బెంచ్ తెలిపింది.

AP High Court division Bench transferred PRC petition to CJ Bench
Author
Guntur, First Published Jan 24, 2022, 3:33 PM IST

అమరావతి: PRC అంశంపై గెజిటెడ్ ఆఫీసర్స్ JAC  దాఖలు చేసిన పిటిషన్ పై ఏపీ హైకోర్టు సోమవారం నాడు కీలక ఆదేశాలు ఇచ్చింది. ఈ పిటిషన్ ను విచారణ చేయడం కోసం చీఫ్ జస్టిస్ నేతృత్వంలోని బెంచ్ కు పంపుతామని డివిజన్ బెంచ్ స్పష్టం చేసింది.

ఏపీ పునర్విభజన చట్టం మేరకు ఉద్యోగులకు వేతనాలివ్వాలని, పీఆర్సీపై ప్రభుత్వం ఇచ్చిన జీవోలను రద్దు చేయాలని కోరుతూ ఈ నెల 20వ తేదీన గెజిటెడ్ ఆఫీసర్స్ .జెఎసీ నేత కృష్ణయ్య పిటిషన్ దాఖలు చేశారు.ఈ పిటిషన్ ను విచారణకు స్వీకరించిన AP High Court హైకోర్టు సోమవారం నాడు మధ్యాహ్నం కీలక ఆదేశాలు జారీ చేసింది.

భోజన విరామం తర్వాత ఈ విషయమై జరిగిన విచారణకు పిటిషన్ దాఖలు చేసిన జెఎసీ నేత కృష్ణయ్య విచారణకు హాజరయ్యారు. వ్యక్తిగత, సర్వీస్ పిటిషన్ గా భావించినా ... ఈ తరహా పిటిషన్లను విచారించే హక్కు, అధికారం డివిజన్ బెంచ్ కు లేదని కోర్టు అభిప్రాయపడింది.ఈ పిటిషన్ విచారణను చీఫ్ జస్టిస్ బెంచ్ కు పంపాలని కూడా తాము అభిప్రాయపడుతున్నట్టుగా డివిజన్ బెంచ్ తేల్చి చెప్పింది. ఈ పిటిషన్ తో ఏపీలోని అందరి ప్రయోజనాలు ముడిపడి ఉన్నాయని డివిజన్ బెంచ్ అభిప్రాయపడింది. ఇది ప్రజా ప్రయోజన పిటిషన్ కావడంతో ఈ పిటిషన్ ను విచారించే అధికారం తమకు లేదని కూడా డివిజన్ బెంచ్ తేల్చి చెప్పింది.

ఇదే పిటిషన్ పై ఇవాళ ఉదయం విచారించింది. పీఆర్సీ  నివేదికను ప్రభుత్వం బహిర్గతం చేయలేదని,నోటీసు లేకుండా ఉద్యోగుల జీతాల్లో కోత విధించడం చట్టవిరుద్దమని పిటిషనర్ తరపున న్యాయవాది కోర్టు దృష్టికి తీసుకొచ్చారు.హెచ్‌ఆర్‌ఏ విభజన చట్టప్రకారం జరగలేదని అని చెప్పారు. మరోవైపు ఉద్యోగుల గ్రాస్ జీతాలు పెరిగాయని ప్రభుత్వం తరఫున అడ్వొకేట్ జనరల్ శ్రీరాం కోర్టుకు తెలిపారు. ఇందుకు సంబంధించిన డేటాను కోర్టుకు తెలిపారు.

ఈ సందర్బంగా హైకోర్టు స్పందించింది. పర్సంటేజ్‌ను చాలెంజ్‌ చేసే హక్కు ఉద్యోగులకు లేదని తెలిపింది. ఎంత జీతం తగ్గిందో చెప్పాలని ప్రశ్నించింది. పూర్తి డేటా లేకుండా పిటిషన్ ఎలా వేస్తారని అసహనం వ్యక్తం చేసింది. పీఆర్సీ నివేదిక బయటకు రాకపోతే ప్రభుత్వాన్ని సంప్రదించాలని సూచించింది.  

ఈ క్రమంలోనే తమ ముందు పిటిషనర్ హాజరుకావాలని హైకోర్టు ఆదేశించింది. సమ్మె నోటీసు ఇవ్వనున్న 12 మంది విచారణకు హాజరు కావాలని సూచించింది. ప్రభుత్వం, ఉద్యోగుల మధ్య సమస్య జఠిలం కాకూడదని కోర్టు తెలిపింది. అందుకే ఉద్యోగ సంఘాల నేతలను విచారణకు పిలిచినట్టుగా పేర్కొంది.

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రితో ఉద్యోగ సంఘాల నేతలు ఈ నెల 7వ తేదీన భేటీ అయ్యారు. ఈ సమావేశంలో 23.29 శాతం పీఆర్సీ ఫిట్‌మెంట్ ఇస్తామని సీఎం   YS Jagan హామీ ఇచ్చారు. అంతేకాకుండా పెండింగ్ లోని ఐదు D.A లను ఒకే సారి ఇస్తామని హమీ ఇచ్చారు. ఫిట్‌మెంట్ కనీసం 27 శాతానికి తగ్గకుండా ఉండాలని ఉద్యోగ సంఘాలు డిమాండ్ చేశాయి. అయితే పెండింగ్ డిఏలు ఒకేసారి ఇస్తామని హమీ ఇవ్వడంతో ఉద్యోగ సంఘాలు సానుకూలంగా స్పందించాయి.

ఈ భేటీ తర్వాత Hraవిషయమై Chief Secretary నేతృత్వంలోని కమిటీతో ఉద్యోగ సంఘాలు సంక్రాంతి పర్వదినం కంటే ముందే పలు దఫాలు భేటీ అయ్యారు. కానీ ఈ సమావేశాల్లో ఉద్యోగ సంఘాల డిమాండ్ పై ప్రభుత్వం నుండి స్పష్టత రాలేదు.  అయితే ఈ నెల 17వ తేదీ రాత్రి పీఆర్సీపై  ప్రభుత్వం జీవోలు జారీ చేసింది. ఈ జీవోల్లో హెచ్ఆర్‌ఏను భారీగా తగ్గించడంపై ఉద్యోగ సంఘాలు అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నాయి. 30 శాతంగా ఉన్న హెచ్ఆర్ఏ స్థానంలో 16 శాతం హెచ్ఆర్ఏ ఇవ్వడంతో తాము 14 శాతం నష్టపోతున్నామని ఉద్యోగ సంఘాల నేతలు చెబుతున్నారు.మరో వైపు ఉేద్యోగ సంఘాలు సమ్మె కు వెళ్లాలని భావిస్తున్నాయి. ఈ విషయమై  రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి సమ్మె నోటీసును కూడా ఇవ్వనున్నాయి. 

Follow Us:
Download App:
  • android
  • ios