బిగ్ బాస్ షో నిలిపియాలని ఏపీ హైకోర్టులో పిటిషన్: పిటిషన్‌ను డిస్పోజ్ చేసిన హైకోర్టు
బిగ్ బాస్ షో నిలిపివేయాలని పిటిషన్ దాఖలు చేసిన పిటిషనర్ కు ఏపీ హైకోర్టు షాకిచ్చింది. ఈ పిటిషన్ ను ఏపీ హైకోర్టు డిస్పోజ్ చేసింది.
అమరావతి: బిగ్ బాస్ షో నిలుపుదల చేయాలన్న దాఖలైన పిటిషన్ ను ఏపీ హైకోర్టు బుధవారంనాడు డిస్పోజ్ చేసింది. ఇదే విషయమై రెండు పిటిషన్లు దాఖలైన విషయాన్ని ఏపీ హైకోర్టు గుర్తు చేసింది.బిగ్ బాస్ 7 షో ను నిలుపుదల చేయాలని ఏపీ హైకోర్టులో ఈ ఏడాది జూలై మాసంలో పిటిషన్ దాఖలైంది.ఈ పిటిషన్ పై బిగ్ బాస్ నిర్వాహకులకు, ఈ షో కు యాంకర్ గా వ్యవహరిస్తున్న సినీ నటుడు అక్కినేని నాగార్జునకు ఏపీ హైకోర్టు నోటీసులు జారీ చేసింది. ఇదే విషయమై మరోసారి పిటిషన్ దాఖలైంది. తాజాగా దాఖలైన పిటిషన్ ను డిస్పోజ్ చేస్తూ ఏపీ హైకోర్టు నిర్ణయం తీసుకుంది
ఇటీవలనే బిగ్ బాస్ 7 షో ప్రముఖ తెలుగు టీవీ చానెల్ లో ప్రసారమౌతుంది. గతంలో కూడ బిగ్ బాస్ 6 షో పై కూడ ఏపీ హైకోర్టులో పిటిషన్లు దాఖలైన విషయం తెలిసిందే.2022 సెప్టెంబర్ మాసంలో బిగ్ బాస్ 6 షో ను నిలిపివేయాలని ఏపీ హైకోర్టులో కేతిరెడ్డి జగదీశ్వర్ రెడ్డి పిటిషన్ దాఖలు చేశారు. బిగ్ బాస్ షో పై ఏపీ హైకోర్టు గతంలో కీలక వ్యాఖ్యలు చేసింది. బిగ్ బాస్ షో విషయమై సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ కూడ తీవ్ర విమర్శలు చేశారు. ఈ షోకు హోస్ట్ గా వ్యవహరిస్తున్న ప్రముఖ సినీ నటుడు నాగార్జునపై కూడ సీపీఐ నారాయణ విమర్శలు చేసిన విషయం తెలిసిందే.