తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌కు హైకోర్టులో ఊరట లభించింది. కోవిడ్ నిబంధనలు ఉల్లంఘించారని విజయవాడ సూర్యారావుపేటలో లోకేష్‌పై నమోదైన కేసును హైకోర్టు కొట్టివేసింది.
తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌కు హైకోర్టులో ఊరట లభించింది. కోవిడ్ నిబంధనలు ఉల్లంఘించారని విజయవాడ సూర్యారావుపేటలో లోకేష్‌పై నమోదైన కేసును హైకోర్టు కొట్టివేసింది. వివరాలు.. 2021 జూన్‌లో టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడును పోలీసులు అరెస్ట్ చేసిన సమయంలో పరామర్శించేందుకు సూర్యారావు పేట కోర్టు సెంటర్‌కి నారా లోకేశ్ వచ్చారు. అయితే ఆయన కోవిడ్ నిబంధనలను ఉల్లంఘించారని పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసుకు సంబంధించి ఈ ఏడాది మార్చిలో నారా లోకేష్.. విజయవాడ మొదటి అదనపు మేజిస్ట్రేట్ కోర్టుకు హాజరయ్యారు.
ఆ సమయంలో లోకేష్ మాట్లాడుతూ.. తనపై అనేక కేసులు నమోదయ్యాయని అన్నారు. గత 12 ఏళ్లుగా సీబీఐ, ఈడీ కోర్టుల విచారణ నుంచి తప్పించుకుంటున్న ముఖ్యమంత్రిలా కాకుండా మేం కేసులకు భయపడమని చెప్పారు. సీఎం జగన్ నిర్దోషి అని భావిస్తే.. ఆయనపై కేసులను త్వరగా విచారణ జరిపాలని కోర్టులను కోరాలని అన్నారు. తమపై అక్రమంగా నమోదు చేసిన కేసుల నుంచి క్లీన్‌గా వస్తామనే నమ్మకం తమకు ఉందన్నారు.
ఇక, ఇదే కేసుకు సంబంధించి నారా లోకేష్ హైకోర్టును ఆశ్రయించారు. ఈ కేసును కొట్టివేయాలని పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై నారా లోకేష్ తరపున సీనియర్ లాయర్ దమ్మాలపాటి శ్రీనివాస్ వాదనలు వినిపించారు. వాదనలను విన్న హైకోర్టు కేసు కొట్టివేస్తూ తీర్పును వెల్లడించింది.
