ఎమ్మెల్సీ అనంతబాబుకు హైకోర్టు షాక్: బెయిల్ పిటిషన్ కొట్టివేత
ఎమ్మెల్సీ అనంతబాబు బెయిల్ పిటిషన్ ను ఏపీ హైకోర్టు బుధవారం నాడు కొట్టివేసింది. ఇరువర్గాల వాదనలు విన్నఏపీ హైకోర్టు ఈ నిర్ణయం తీసుకుంది. అమరావతి: ఎమ్మెల్సీ అనంతబాబు బెయిల్ పిటిషన్ ను ఏపీ హైకోర్టు బుధవారం నాడు కొట్టివేసింది. గతంలో డిఫాల్ట్ బెయిల్ పిటిషన్ ను కూడా ఏపీ హైకోర్టు కొట్టివేసిన విషయం తెలిసిందే. డ్రైవర్ సుబ్రమణ్యం హత్య కేసులో ఎమ్మెల్సీ అనంతబాబు ఈ ఏడాది మే23 నుండి రాజమండ్రి సెంట్రల్ జైల్లోనే ఉన్నాడు.
అమరావతి: ఎమ్మెల్సీ అనంతబాబు బెయిల్ పిటిషన్ ను ఏపీ హైకోర్టు బుధవారం నాడు కొట్టివేసింది. గతంలో డిఫాల్ట్ బెయిల్ పిటిషన్ ను కూడా ఏపీ హైకోర్టు కొట్టివేసిన విషయం తెలిసిందే. డ్రైవర్ సుబ్రమణ్యం హత్య కేసులో ఎమ్మెల్సీ అనంతబాబు ఈ ఏడాది మే23 నుండి రాజమండ్రి సెంట్రల్ జైల్లోనే ఉన్నాడు. ఎస్సీ, ఎస్టీ కోర్టులో అనంతబాబు మూడు దఫాలు బెయిల్ పిటిషన్లు దాఖలు చేశాడు
.మూడు దఫాలు కూడఎస్సీ, ఎస్టీ కోర్టు బెయిల్ పిటిషన్లను కొట్టివేసింది. 90 రోజుల్లో చార్జీషీట్ దాఖలుచేయనందున డిఫాల్ట్ బెయిల్ పిటిషన్ ను అనంతబాబు దాఖలుచేశారు. ఈ ఏడాది సెప్టెంబర్ 26న డిఫాల్ట్ బెయిల్ పిటిషన్ ను ఏపీ హైకోర్టు కొట్టివేసింది. దీంతో అనంతబాబు హైకోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేశాడు. డిపాల్ట్ పిటిషన్ ను కోర్టు తిరస్కరించింది. తాజాగా సాధారణ బెయిల్ పిటిషన్ ను కూడా హైకోర్ట్ కొట్టివేసింది.
also read:డ్రైవర్ సుబ్రమణ్యం హత్య కేసు: ఎమ్మెల్సీ అనంతబాబు రిమాండ్ అక్టోబర్ 7వ తేదీకి పొడిగింపు
ఈ ఏడాది ఆగస్టు మాసంలోఅనంతబాబుతల్లి మంగారత్నం మృతి చెందడంతో ఎస్సీ, ఎస్టీ కోర్టు అనంతబాబుకు బెయిల్ ఇచ్చింది,. తల్లి అంత్యక్రియలు ముగిసిన తర్వాత అనంతబాబు తిరిగి జైలుకు వెళ్లారు. అయితే తల్లిఅంత్యక్రియల్లోపాల్గొనేందుకు జైలు నుండి బయటకు వచ్చిన సమయంలోనే తన బెయిల్ ను పొడిగించాలని అనంతబాబు కోరాడు. అనంతబాబు అభ్యర్ధనను కోర్టు తిరస్కరించింది.దీంతో ఆయన తిరిగి జైలుకే వెళ్లాల్సి వచ్చింది.
ఈ ఏడాది మే 20వ తేదీన డ్రైవర్ సుబ్రమణ్యం హత్యకు గురయ్యాడు. ఈ హత్య కేసులో ఎమ్మెల్సీ అనంతబాబును పోలీసులు అరెస్ట్ చేశారు. మద్యం తాగినందుకు మందలించే క్రమంలో ఎమ్మెల్సీ అనంతబాబు చేయి చేసుకోవడంతో గేటు దాకి డ్రైవర్ సుబ్రమణ్యం మరణించాడని పోలీసులు అప్పట్లో ప్రకటించారు. అయితే దీన్ని రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించేందుకు ఎమ్మెల్సీ అనంతబాబు ప్రయత్నించారని పోలీసులు మీడియాకు వివరించారు. ఈ కేసులో అనంతబాబును పోలీసులుఅరెస్ట్ చేశారు.
అనంతబాబును అరెస్ట్ చేయాలని కుటుంబ సభ్యులు,దళిత సంఘాలు పెద్ద ఎత్తున అరెస్ట్ చేసినవిషయం తెలిసిందే. అనంతబాబు బెయిల్ పై బయటకు వస్తే సాక్షులను ప్రభావితం చేసే అవకాశం ఉందని సుబ్రమణ్యం కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఈ కేసును సీబీఐతో విచారణ చేయించాలని సుబ్రమణ్యం పేరేంట్స్ కోరుతున్నారు. అనంతబాబు బంధువులు తమను బెదిరించారని డ్రైవర్ సుబ్రమణ్యం కుటుంబ సభ్యులు గతంలో పోలీసులకు ఫిర్యాదులు కూడా చేశారు. డ్రైవర్ సుబ్రమణ్యం భార్యకు వైద్యఆరోగ్య శాఖలో ప్రభుత్వం జూనియర్ అసిస్టెంట్ గా ఉద్యోగం కల్పించింది.