Asianet News TeluguAsianet News Telugu

Amaravati Farmers Meeting: రైతుల బహిరంగ సభకు AP High Court గ్రీన్ సిగ్న‌ల్

Amaravati Farmers Meeting: తిరుపతిలో అమరావతి రైతులు బ‌హిరంగ స‌భకు ఏపీ హైకోర్ట్ అనుమతిస్తూ ఆదేశాలు జారీ చేసింది. స‌భ‌ను వ్య‌తిరేకించ‌డంతో  రైతులు హైకోర్ట్ ను ఆశ్ర‌యించారు. నేడు హైకోర్టు రైతుల పిటిష‌న్ పై విచార‌ణ చేప‌ట్టి.. పైన‌ల్ గా రైతుల అభిప్రాయాల‌తో ఏకీభ‌విస్తో.. సభకు అనుమతి ఇచ్చింది. మధ్యాహ్నం 2 గంటల నుంచి 6 గంటల వరకు బహిరంగ సభకు అనుమతినిచ్చింది కోర్ట్. 
 

AP High Court Allows Amaravati Farmers To Hold Sabha In Tirupati
Author
Hyderabad, First Published Dec 15, 2021, 6:50 PM IST | Last Updated Dec 15, 2021, 6:50 PM IST

Amaravati Farmers Meeting: అమరావతి రాజధాని రైతుల బహిరంగ సభకు ఆంధ్ర‌ప్ర‌దేశ్  హైకోర్ట్ అనుమతించింది.  తిరుపతిలో నిర్వహించాలనుకున్న బహిరంగసభకు ఏపీ హైకోర్టు గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చింది. తిరుపతిలో అమరావతి రైతుల సభకు నిర్వ‌హించ‌డానికి జ‌గ‌న్ స‌ర్కార్ అనుమ‌తించ‌క‌పోవడంతో ..  రైతులు హైకోర్ట్ ను  ఆదేశించారు. ఈ మేర‌కు కోర్టులో పిటిష‌న్ దాఖాలు చేశారు. రైతులు దాఖ‌లు చేసినా.. పిటిష‌న్ పై ఈ రోజు హైకోర్టు విచార‌ణ చేప‌ట్టింది. 

ఈ క్ర‌మంలో రైతుల తరపున సీనియర్ న్యాయవాది లక్ష్మీనారాయణ వాదనలు వినిపించగా... ప్రభుత్వం తరపున అదనపు అడ్వొకేట్ జనరల్ పొన్నవోలు సుధాకర్ రెడ్డి వాదించారు. ఈ క్ర‌మంలో ప్ర‌భుత్వం త‌రుపు న్యాయవాది త‌న వాద‌న‌లు వినిపిస్తో.. తిరుప‌తిలో సభ జరిగితే..  రాష్ట్రంలోని రెండు ప్రాంతాల మధ్య ఘర్షణ తలెత్తే ప్రమాదం ఉందని వివ‌రించారు. 

Read Also: రైతు ఆవేదన యాత్ర చేపట్టనున్న వైఎస్ శర్మిల.. ఈ నెల 19 నుంచి ప్రారంభం

సుధాకర్ రెడ్డి . గ‌తంలో అమరావతి రైతుల పాదయాత్రలో పోలీసులపై దాడి చేసారంటూ వీడియోలు చూపించిన ప్రభుత్వ ఏజీ పొన్నవోలు సుధాకర్. అలాగే.. ఓమిక్రాన్ విజృంభిస్తున్న వేళ బ‌హిరంగ స‌మావేశాల‌కు ఎలాంటి  అనుమతి ఇవ్వకూడదని ప్రభుత్వం తరుపున న్యాయవాది వాదించాడు.  బహిరంగ సభ జరిగే ప్రదేశం తిరుపతి నుంచీ 6 కిలోమీటర్లు, ఎయిర్ పోర్టు నుంచీ 13 కిలోమీటర్లు అని తెలిపిన రైతుల తరఫు న్యాయవాది. రాజ్యాంగం హక్కులు, భావప్రకటన స్వేచ్ఛపై వాదనలు జరిగాయి. కాగా రైతుల తరుపున వాదనలతో ఏకీభవించిన కోర్ట్ సభకు షరతులతో కూడిన అనుమతి ఇచ్చింది. 

Read Also:   West Godavari Accident:క్షణాల్లో రోడ్డుపై బస్సు వాగులో... ఎలా తప్పించుకున్నానంటే: ప్రయాణికుడు

అయితే.. ప్ర‌జాస్వామ్యంలో శాంతిపూర్వకంగా ప్ర‌తి ఒక్క‌రూ త‌మ అభిప్రాయాల‌ను వ్య‌క్త‌ప‌రిచే హ‌క్కు ఉంద‌నీ, రాజ్యాంగం క‌ల్పించిన భావప్రకటన స్వేచ్ఛ కు ఆటంకం క‌లుగుతోందని వాదించారు రైతులు ప‌క్ష లాయ‌ర్.  దీంతో కోర్టులో వాడీవేడీ వాద‌న జ‌రిగింది. 

Read Also: ఏపీ: 24 గంటల్లో 163 మందికి కరోనా.. గోదావరి జిల్లాల్లో మళ్లీ పెరుగుతున్న కేసులు..

చివ‌ర‌గా.. ఇరుపక్షాల వాదనలను విన్న హైకోర్టు  రైతుల అభిప్రాయ‌ల‌కు గౌర‌విస్తూ.. మధ్యాహ్నం 2 గంటల నుంచి 6 గంటల వరకు బహిరంగ సభకు అనుమతినిచ్చింది కోర్ట్. ఎలాంటి ఉల్లంఘ‌న‌ల‌కు పాల్ప‌డ‌కుండా సభ నిర్వహించుకోవాలని హైకోర్ట్ ఆదేశించింది.  ప్రభుత్వంపై, ప్రభుత్వ అధికారులపై ఎలాంటి కామెంట్లు చేయరాని షరతు విధించింది.   సభకు అనుమతినిచ్చే విషయంపై  సభకు భద్రత కల్పించాల్పిన బాధ్యత పోలీసుదే అని హైకోర్ట్ తెలిపింది. ఈ నెల 17న రైతులు తిరుపతిలో సభను నిర్వహించనున్నారు.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios