Asianet News TeluguAsianet News Telugu

చంద్రబాబు మధ్యంతర బెయిల్ పిటిషన్: విచారణ నుండి తప్పుకున్న జడ్జి

ఏపీ స్కిల్ డెవలప్ మెంట్ కేసులో చంద్రబాబు దాఖలు చేసిన మధ్యంతర బెయిల్ పిటిషన్ పై విచారణ నుండి  జడ్జి జ్యోతిర్మయి తప్పుకున్నారు.

AP High Court Adjourns hearing to on october 30 over Chandrababu Naidu Bail petition lns
Author
First Published Oct 27, 2023, 11:09 AM IST

అమరావతి:టీడీపీ చీఫ్ చంద్రబాబు  దాఖలు చేసిన  మధ్యంతర బెయిల్ పిటిషన్ పై  విచారణ నుండి జడ్జి తప్పుకున్నారు.  నాట్ బి ఫోర్ మీ అని ఈ పిటిషన్ పై విచారణ నుండి జడ్జి జ్యోతిర్మయి తప్పుకున్నారు.ఈ పిటిషన్ పై విచారణను  ఈ నెల  30వ తేదీకి వాయిదా వేసింది  హైకోర్టు.ఈ పిటిషన్ ను ఏ బెంచ్ విచారించాలో ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి నిర్ణయం తీసుకొంటారు.

చంద్రబాబు దాఖలు చేసిన మధ్యంతర బెయిల్ పిటిషన్ పై  ఏపీ హైకోర్టు వెకేషన్ బెంచ్ ఇవాళ  విచారణ ప్రారంభించింది.బెంచ్ పైకి వచ్చిన జడ్జి జ్యోతిర్మయి నాట్ బి ఫోర్ మీ అని ప్రకటించారు. అయితే  ఈ పిటిషన్ పై విచారణను వాయిదా వేయవద్దని చంద్రబాబు తరపు న్యాయవాదులు కోరారు.  ఈ పిటిషన్ పై విచారణను  ఈ నెల 30వ తేదీకి వాయిదా వేస్తున్నట్టుగా  జడ్జి ప్రకటించారు.తన ఉత్తర్వులు  ప్రత్యామ్నాయ మార్గాలకు అడ్డంకి కావని  హైకోర్టు జడ్జి జ్యోతిర్మయి తెలిపారు. మరో వైపు ఈ పిటిషన్ పై విచారణను వేరే బెంచ్ కు బదిలీకి సంబంధించి చర్యలు తీసుకోవాలని హైకోర్టు రిజిస్ట్రీనిని  జడ్జి ఆదేశించారు.

ఏపీ స్కిల్ డెవలప్ మెంట్ కేసులో  చంద్రబాబుకు  బెయిల్ ఇవ్వాలని  ఏపీ హైకోర్టులో  పిటిషన్ దాఖలు చేశారు .ఈ పిటిషన్ పై విచారణ సాగుతున్న సమయంలోనే  చంద్రబాబు ఆరోగ్య కారణాల రీత్యా  15 రోజుల పాటు మధ్యంతర బెయిలివ్వాలని హైకోర్టును కోరారు. ఈ సమయంలోనే  ఏపీ హైకోర్టుకు  దసరా సెలవులు రావడంతో  ఈ పిటిషన్ ను వెకేషన్ బెంచ్ కు  బదిలీ చేయాలని హైకోర్టును చంద్రబాబు తరపు న్యాయవాదులు కోరారు.ఇందుకు  ఏపీ హైకోర్టు అంగీకరించింది.ఇదిలా ఉంటే చంద్రబాబుకు బెయిల్ ఇవ్వవద్దని ఏపీ సీఐడీ తరపు న్యాయవాది పొన్నవోలు సుధాకర్ రెడ్డి వాదనలు వినిపించారు.

also read:చంద్రబాబు కుడి కంటికి ఆపరేషన్: బెయిల్ పై అత్యవసర విచారణకై ఏపీ హైకోర్టులో పిటిషన్

చంద్రబాబు ఆరోగ్య పరిస్థితుల రీత్యా  బెయిల్ పిటిషన్ పై విచారణ నిర్వహించాలని ఆయన తరపు న్యాయవాదులు  నిన్న  ఏపీ హైకోర్టులో హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ పై ఇవాళ వేకేషన్ బెంచ్ విచారణను ప్రారంభించింది.  అయితే ఈ పిటిషన్ పై విచారణ నుండి తప్పుకుంటున్నట్టుగా  జడ్జి జ్యోతిర్మయి ప్రకటించారు. ఏపీ స్కిల్ డెవలప్ మెంట్ కేసులో చంద్రబాబును ఏపీ సీఐడీ అధికారులు  ఈ ఏడాది సెప్టెంబర్ 9న అరెస్ట్ చేశారు.ఈ కేసులో  అరెస్టైన చంద్రబాబు ప్రస్తుతం జ్యుడీషీయల్ రిమాండ్ లో ఉన్నారు.  ఏపీ స్కిల్ డెవలప్ మెంట్ కేసులో  ఏపీ హైకోర్టు ఉత్తర్వులను  సవాల్ చేస్తూ  చంద్రబాబు దాఖలు చేసిన ఎస్ ఎల్ పీ  పై ఇరువర్గాల వాదనలు పూర్తయ్యాయి.ఈ పిటిషన్ పై  సుప్రీంకోర్టు  ఈ ఏడాది నవంబర్  8న తీర్పును వెల్లడించే అవకాశం ఉంది. 

Follow Us:
Download App:
  • android
  • ios