మాజీ మంత్రి కొల్లు రవీంద్ర భార్య నీలిమ దాఖలు చేసిన పిటిషన్ పై విచారణను ఏపీ హైకోర్టు  వాయిదా వేసింది. 


అమరావతి: మాజీ మంత్రి కొల్లు రవీంద్ర భార్య నీలిమ దాఖలు చేసిన పిటిషన్ పై విచారణను వాయిదా వేసింది ఏపీ హైకోర్టు. దసరా సెలవుల తర్వాత ఈ పిటిషన్ పై విచారణ చేస్తామని హైకోర్టు తెలిపింది. 

మాజీ మంత్రి కొల్లు రవీంద్రను పోలీసులు అక్రమంగా నిర్భంధించారని ఆయన భార్య నీలిమ ఏపీ హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ ను దాఖలు చేసింది.ఈ పిటిషన్ పై ఏపీ హైకోర్టులో విచారణ జరిగింది. పిటిషనర్ తరపున దమ్మాలపాటి శ్రీనివాస్ ఏపీ హైకోర్టులో వాదనలు విన్పించారు. కొన్ని గంటల పాటు మాజీ మంత్రి కొల్లు రవీంద్రను పోలీసులు నిర్బంధించారని శ్రీనివాస్ కోర్టులో వాదించారు.

 మాజీ మంత్రి కొల్లు రవీంద్రపై కేసు నమోదు చేసినట్టుగా ప్రభుత్వ తరపు న్యాయవాది హైకోర్టుకు తెలిపారు. రవీంద్రకు 151 సీఆర్‌పీసీ కింద నోటీసు ఇచ్చేందుకు ప్రయత్నించగా నిరాకరించారని హైకోర్టుకు ప్రభుత్వ న్యాయవాది చెప్పారు. పెద్ద నేరాలకు మాత్రమే 151 నోటీసు ఇవ్వాలి కదా అని ఏపీ హైకోర్టు ప్రభుత్వ తరపు న్యాయవాదిని ప్రశ్నించింది.

also read:నా భర్తను అక్రమంగా నిర్బంధించారు: ఏపీ హైకోర్టులో మాజీ మంత్రి కొల్లు రవీంద్ర భార్య నీలిమ పిటిషన్‌పై నేడు విచారణ

ఈ విషయమై పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని పోలీసులనుఏపీ హైకోర్టు ఆదేశించింది.దసరా సెలవుల తర్వాత ఈ పిటిషన్ పై విచారణ జరుపుతామని హైకోర్టు తెలిపింది. ఈ పిటిషన్ పై విచారణను వాయిదా వేసింది.