అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు కేసు: చంద్రబాబు బెయిల్ పిటిషన్ పై విచారణ ఈ నెల 26కు వాయిదా
అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు కేసుపై విచారణను ఈ నెల 26కు వాయిదా వేసింది ఏపీ హైకోర్టు.
అమరావతి: అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు కేసు విచారణను ఈ నెల 26వ తేదీకి వాయిదా వేసింది ఏపీ హైకోర్టు.అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో టీడీపీ చీఫ్ చంద్రబాబు నాయుడు బెయిల్ కోరుతూ ఏపీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ బెయిల్ పిటిషన్ పై విచారణను ఈ నెల 26కు వాయిదా వేసింది ఏపీ హైకోర్టు.
అమరావతి రాజధాని నిర్మాణంలో భాగంగా ఇన్నర్ రింగ్ రోడ్డు నిర్మాణాన్ని చంద్రబాబు సర్కార్ చేపట్టింది. అయితే ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్ మెంట్ ను ఇష్టారీతిలో మార్పులు చేశారని జగన్ సర్కార్ ఆరోపణలు చేసింది. ఇన్నర్ రింగ్ రోడ్డును మార్పులు చేసి అక్రమాలకు పాల్పడ్డారని సీఐడీ ఆరోపణలు చేసింది. ఈ విషయంలో చంద్రబాబు, మాజీ మంత్రి నారాయణలపై సీఐడీ అభియోగాలు మోపింది. తమ భూములకు విలువ పెరిగేలా ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్ మెంట్ ను మార్చారని చంద్రబాబు సర్కార్ పై వైసీపీ ఆరోపణలు చేసింది.
ఈ విషయమై అందిన ఫిర్యాదు మేరకు ఏపీ సీఐడీ కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తుంది. ఏపీ స్కిల్ డెవలప్ మెంట్ కేసులో ఇప్పటికే చంద్రబాబును ఏపీ సీఐడీ అరెస్ట్ చేసింది. ఈ సమయంలోనే విజయవాడ ఏసీబీ కోర్టులో ఏపీ సీఐడీ అధికారులు పీటీ వారెంట్ దాఖలు చేసింది. దీంతో అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో ముందస్తు బెయిల్ కోరుతూ చంద్రబాబునాయుడు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు.ఈ బెయిల్ పిటిషన్ పై విచారణను ఈ నెల 26వ తేదీకి వాయిదా వేసింది ఏపీ హైకోర్టు. హైబ్రిడ్ మోడ్ పద్దతిలో ఈ పిటిషన్ పై విచారణ చేపట్టనున్నట్టుగా ఏపీ హైకోర్టు ఇవాళ తెలిపింది.
ఈ నెల 26న అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో చంద్రబాబు బెయిల్ పిటిషన్ పై విచారణ నిర్వహించనుంది ఏపీ హైకోర్టు. ఇదిలా ఉంటే ఏపీ స్కిల్ డెవలప్ మెంట్ కేసులో చంద్రబాబును కస్టడీకి ఇవ్వాలని సీఐడీ దాఖలు చేసిన పిటిషన్ పై ఏసీబీ కోర్టు ఇవాళ సాయంత్రం నాలుగు గంటలకు తీర్పును వెల్లడించనుంది.