అమరావతి: ఆంధ్రప్రదేశ్ హైకోర్టును కంటైన్మెంట్ జోన్‌గా ప్రకటించాలని, రిజిస్ట్రార్ జనరల్ రాజశేఖర్ మృతిపై దర్యాప్తు జరపాలని దాఖలైన పిటిషన్‌పై విచారణను పునఃప్రారంభించేందుకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

ఈ కేసులో జడ్జి రామకృష్ణ ఇంప్లీడ్ పిటిషన్ దాఖలు చేసే సమయానికే ఒరిజినల్ పిటిషన్‌పై విచారణ పూర్తిచేసి జడ్జ్‌మెంట్ కోసం హైకోర్టు రిజర్వ్ చేసింది. అయితే ఈ దశలో పిటిషన్‌పై విచారణ పునఃప్రారంభించాలని, తనను ఇంప్లీడ్ చేయాలని జడ్జి రామకృష్ణ పిటిషన్ దాఖలు చేశారు. 

ఈ నేపథ్యంలో విచారణను పునః ప్రారంభించేందుకు హైకోర్టు నిర్ణయించింది. జడ్జి రామకృష్ణ ఇంప్లీడ్ పిటిషన్‌లో ఒక పేరాపై కౌంటర్ దాఖలు చేసేందుకు ప్రభుత్వానికి గురువారం వరకు గడువు ఇస్తూ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.