కరోనా కట్టడికి అన్ని రకాల చర్యలు చేపట్టామన్నారు ఏపీ వైద్య ఆరోగ్య శాఖ ముఖ్యకార్యదర్శి అనిల్ సింఘాల్. బుధవారం అమరావతిలో ఆయన మీడియాతో మాట్లాడుతూ... గతేడాది కంటే ఎక్కువ ఆసుపత్రులను కోవిడ్ కేంద్రాలుగా మార్చామని అనిల్ కుమార్ తెలిపారు. ఐసీయూ బెడ్లు, ఆక్సిజన్ బెడ్లను భారీగా అందుబాటులో వుంచామని ఆయన స్పష్టం చేశారు.

రాష్ట్రవ్యాప్తంగా ఆర్టీపీసీఆర్ టెస్టుల సంఖ్య పెంచుతున్నామని అనిల్ తెలిపారు. బెడ్స్ విషయంలో లెక్కలు పక్కాగా అప్‌డేట్ చేస్తున్నామని.. రాష్ట్రంలో దాదాపు 9 వేల రెమ్‌డిసివర్ ఇంజక్షన్లు అందుబాటులో వున్నాయని అనిల్ కుమార్ సింఘాల్ వెల్లడించారు. ఫిర్యాదులు, కొరతలపై సమీక్షలు చేస్తూ.. బెడ్స్, ఆక్సిజన్ అందుబాటులో వుంచుతున్నామని అనిల్ చెప్పారు. 

Also Read:టీకా రిజిస్ట్రేషన్ కోసం ఎగబడ్డ జనం: క్రాష్ అయిన కోవిన్ యాప్.. కేంద్రంపై విమర్శలు

అంతకుముందు కరోనా వైరస్‌ను కట్టడి చేసేందుకు గాను అనుసరించాల్సిన చర్యలపై చర్చించేందుకు గాను ఏపీ కేబినెట్ సబ్ కమిటీ బుధవారం మరోసారి సమావేశమైంది. భేటీ అనంతరం రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని మీడియాకు వివరాలు తెలిపారు.

కరోనా కట్టడికి ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోందని నాని తెలిపారు. కరోనా కేసులు పెరిగే కొద్ది బెడ్స్‌కు డిమాండ్ పెరుగుతోందని మంత్రి వెల్లడించారు. 33 వేలకు పైగా కోవిడ్ సెంటర్స్‌లో బెడ్స్ ఏర్పాటు చేస్తామని ఆళ్ల నాని పేర్కొన్నారు. బెడ్స్, ఆక్సిజన్ కొరత రాకుండా చర్యలు తీసుకోవాలని అధికారులు ఆదేశించినట్లు ఆయన తెలిపారు. 

 

 

కరోనా మహమ్మారి నుంచి కాపాడుకోవడానికి ప్రతి ఒక్కరూ మాస్కులు తప్పకుండా ధరించాలని, శానిటైజ్ చేసుకోవాలని, సామాజిక దూరం పాటించాలని ఏషియానెట్ విజ్ఢప్తి చేస్తోంది. సాధ్యమైనంత త్వరగా కరోనా టీకా తీసుకోవాలని కూడా కోరుతోంది. అందరం కలిసి కరోనా వ్యాప్తిని అరికడుదాం, మనల్ని మనం రక్షించుకుందాం.  #ANCares #IndiaFightsCorona