Asianet News TeluguAsianet News Telugu

ఏపీలో కరోనా కేసులు: రెండోసారి ఎవ్వరికి సోకలేదన్న ప్రభుత్వం

ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పటి వరకు ఓ వ్యక్తికి రెండోసారి కరోనా వచ్చిన కేసులు ఎక్కడా నమోదు కాలేదన్నారు ఆరోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డి. రాష్ట్రంలో కరోనా మరణాలను తగ్గించడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని, తమ ప్రణాళికలకు మంచి ఫలితాలు వస్తున్నాయని ఆయన తెలిపారు. 

ap health chief secretary jawahar reddy says we try control corona
Author
Amaravathi, First Published Sep 1, 2020, 6:45 PM IST

ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పటి వరకు ఓ వ్యక్తికి రెండోసారి కరోనా వచ్చిన కేసులు ఎక్కడా నమోదు కాలేదన్నారు ఆరోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డి. రాష్ట్రంలో కరోనా మరణాలను తగ్గించడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని, తమ ప్రణాళికలకు మంచి ఫలితాలు వస్తున్నాయని ఆయన తెలిపారు.

మంగళవారం మీడియాతో మాట్లాడిన ఆయన రోజుకి పదివేలకు పైగా కేసులు నమోదవుతున్నా.. మరణాల రేటు 1 శాతం కంటే తక్కువగా ఉందని జవహర్ వెల్లడించారు. ఎక్కువ కేసులు నమోదవుతున్న అన్ని రాష్ట్రాల కంటే ఏపీలో మరణాల రేటు తక్కువగా ఉందని ఆయన చెప్పారు.

నెల్లూరు, ప్రకాశం, చిత్తూరు, శ్రీకాకుళం, పశ్చిమ గోదావరి జిల్లాల్లో కేసులు పెరుగుతున్నాయని జవహర్ వెల్లడించారు. సీరో సర్వేలెన్స్ సర్వేను 4 జిల్లాల్లో చేపట్టనున్నామని ఆయన ప్రకటించారు. అర్బన్ ప్రాంతాల్లోనే ఎక్కువ కేసులు నమోదవుతున్నాయిని.. మిగిలిన 9 జిల్లాల్లో కూడా సీరో సర్వేలెన్స్ సర్వే చేస్తున్నామని జవహర్ వెల్లడించారు.

ఆంధ్రప్రదేశ్‌లో ప్రతి 30 రోజులకు కేసులు రెట్టింపు అవుతున్నాయని ఆయన తెలిపారు. ప్రకాశం, నెల్లూరుల్లో వేగంగా డబుల్ అవుతున్నాయని... 96 శాతం కేసులు కంటైన్మెంట్ క్లస్టర్లలోనే వస్తున్నాయన్నారు.

కరోనా సోకకుండా ప్రజలను చైతన్యం చేసేందుకు పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నామని.. ప్రజల కోసం 104 కాల్ సెంటర్, హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేశామని జవహర్ స్పష్టం చేశారు. 204 హాస్పిటల్‌లో పేషెంట్లు ఉన్నారని.. 217 హెల్ప్ డెస్క్‌లను ఏర్పాటు చేశామని, 14 వేలకు పైగా ఫోన్ కాల్‌లకు సమాధానం చెప్పామని వెల్లడించారు.

కొన్ని పత్రికల్లో వైద్యులను బాధ కలిగించేలా వార్తలు రాస్తున్నారని... ఓ ప్రధాన పత్రికల్లో ఖాళీల బోర్డులు పెట్టలేదని పచ్చి అబద్ధాలు రాశారని జవహర్ వెల్లడించారు. ఇలాంటి ఘటనలు దురదృష్టకరమని పేర్కొన్నారు. 

Follow Us:
Download App:
  • android
  • ios