Asianet News TeluguAsianet News Telugu

ఏపీ గ్రామ పంచాయతీ ఎన్నికలు: బోణీ కొట్టిన టీడీపీ, సర్పంచ్ గా విక్రమ్ దీప్తి ఏకగ్రీవం

ఏపీ గ్రామ పంచాయతీ ఎన్నికల్లో టీడీపీ బోణీ కొట్టింది. పర్చూరు ఎన్నికల్లో టీడీపీ తన సత్తా చాటింది. టీడీపీ మద్దతు ఇచ్చిన విక్రమ్ దీప్తి సర్పంచ్ గా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.

AP Gram Panchayt Elections: TDP supporter Vikram Deepthi wins Sarpanch post
Author
Parchoor, First Published Feb 3, 2021, 8:09 AM IST

నెల్లూరు: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నెల్లూరు జిల్లా పర్చూరు గడ్డపై తెలుగుదేశం పార్టీ జెండా రెపరెప లాడుతోంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో పర్చూరు నియోజకవర్గంలోని చిన్నగంజాం మండలం గొనసపూడి పంచాయతీని తెలుగుదేశం పార్టీ సొంతం చేసుకుంది. 

తొలి ఏకగ్రీవ పంచాయతీగా గొనసపూడి  చరిత్ర సృష్టించింది. సర్పంచ్ గా తెలుగుదేశం పార్టీ సానుభూతిపరులు విక్రమ్ దీప్తి ఎన్నికయ్యారు. సర్పంచ్ ఉప సర్పంచ్ ను పదవులను తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు కైవసం చేసుకున్నారు. 

మొత్తం 10 వార్డులకు గాను తెలుగుదేశం పార్టీ  6 వార్డులు, వైసీపీకి నాలుగు వార్డులు దక్కాయి. సర్పంచ్ ఉప సర్పంచ్ లతోపాటు పాలకవర్గానికి పర్చూరు శాసనసభ్యులు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు శుభాకాంక్షలు తెలిపారు. 

ఈ సందర్భంగా నాయకులు పొద వీరయ్య, బత్తుల శ్రీనివాసరావు, విక్రమ్ నారాయణ, తెలుగుదేశం పార్టీ నాయకులను కార్యకర్తలను అభినందించారు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తొలి విడత గ్రామ పంచాయతీ ఎన్నికల్లో నామినేషన్ల ఘట్టం ముగిసిన విషయం తెలిసిందే. రెండో విడత నామినేషన్ల పర్వం కొనసాగుతోంది.

Follow Us:
Download App:
  • android
  • ios