ఏపీలో పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గనున్నాయా..? ఆర్థిక శాఖ మంత్రి యనమల మాటలు వింటే.. తగ్గుతుందనిపిస్తోంది.  ఎన్డీయే ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ధరలు ఆకాశానంటుతున్న సంగతి తెలిసిందే. అయితే.. ఇటీవల కేంద్ర ప్రభుత్వం వీటిపై ఉన్న సర్వీస్ టాక్స్ 2శాతం తగ్గించింది. అదేవిధంగా పన్ను శాతం తగ్గించాలని రాష్ట్ర ప్రభుత్వాలకు కూడా సూచించింది.

కేంద్రం ఈ సూచలను చేసి చాలా రోజులు అవుతున్నా.. ఇప్పటి వరకు ఏ రాష్ట్ర ప్రభుత్వం దీనిపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. అయితే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ఈ విషయంలో కేంద్రం చేసిన ఆలోచనకు సానుకూలంగా స్పందిస్తోంది...దీని గురించి ఆలోచిస్తున్నామని గురువారం మంత్రి యనమల చెప్పారు. విజయవాడలో జరిగిన వాణిజ్య పన్నుల శాఖ రాష్ట్ర స్థాయి సమావేశంలో పాల్గొన్న యనమల.. జీఎస్టీ తదితర అంశాల గురించి మాట్లాడారు. డీజిల్, పెట్రోల్ పై పన్ను తగ్గించే ఆలోచనలో ఉన్నట్లు తెలిపారు. ఒక వేళ రాష్ట్ర ప్రభుత్వం నిజంగా పన్ను తగ్గించే.. పెట్రోల్, డీజిల్ ధరలు కూడా తగ్గుముఖం పట్టే అవకాశం ఉంది.