వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖ అధికారులు రెండు రోజుల పాటు పాపికొండల విహారయాత్రను నిలిపివేస్తూ ఆదేశాలు జారీ చేశారు. వాతావరణంలో అనూహ్య మార్పులు, భారీ వర్షాల నేపథ్యంలో ప్రజల భద్రతను దృష్టిలో వుంచుకుని ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. 

పాపికొండల టూర్‌కి వెళ్లాలనుకుంటున్నారా .. అయితే మీకో బ్యాడ్ న్యూస్. ఏపీ ప్రభుత్వం పాపికొండల విహారయాత్రను నిలిపివేసింది. వాతావరణంలో అనూహ్య మార్పులు, భారీ వర్షాల నేపథ్యంలో ప్రజల భద్రతను దృష్టిలో వుంచుకుని ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే పలుమార్లు పాపికొండల యాత్రకు ప్రభుత్వం బ్రేక్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ నెలలో ప్రభుత్వం నుంచి అనుమతులు వస్తాయని భావిస్తున్న వేళ.. వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో అధికారులు రెండు రోజుల పాటు పాపికొండల విహారయాత్రను నిలిపివేస్తూ ఆదేశాలు జారీ చేశారు. మంగళ, బుధవారాల్లో పాపికొండల పర్యటనకు వెళ్లే బోట్లను నిలిపివేసినట్లు అధికారులు తెలిపారు. 

కాగా.. నడి వేసవి మండుటెండల సమయంలో విచిత్రంగా తెలుగురాష్ట్రాలను వర్షాలు ముంచెత్తుతున్నాయి. గత కొద్దిరోజులుగా తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ లో ఈదురుగాలులు, ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తున్నాయి. ఈ వర్షాలు ఇంకొన్ని రోజులు ఇలాగే కొనసాగే అవకాశాలున్నాయని వాతావరణ విభాగం హెచ్చరిస్తోంది. ఇవాళ(మంగళవారం) కూడా ఆంధ్ర ప్రదేశ్ లో భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయన్న హెచ్చరికల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా వుండాలని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ అప్రమత్తమయ్యింది. 

ALso Read: ఏపీలో నేడు, రేపు భారీ వర్షాలు... పిడుగులు పడే ప్రమాదం : విపత్తు నిర్వహణ సంస్థ హెచ్చరిక

విదర్భ నుండి ఉత్తర తమిళనాడు వరకు తెలంగాణ, కర్ణాటక మీదుగా ద్రోణి కొనసాగుతోందని వాతావరణ శాఖ తెలిపింది. దీని ప్రభావంతో అటు తెలంగాణతో పాటు ఏపీలోనూ వర్షాలు కురుస్తాయని హెచ్చరించారు. ఈ రెండ్రోజులు అక్కడక్కడ భారీ వర్షాలు, మరికొన్నిచోట్ల మోస్తరు వర్షాలు కురవనున్నాయని... పిడుగులు కూడా పడవచ్చని తెలిపారు. కాబట్టి వ్యవసాయ పనులకు వెళ్ళే రైతులు, కూలీలు, పశువులు, గొర్రెల కాపరులు చెట్ల కింద ఉండరాదని ఏపీ విపత్తుల సంస్థ ఎండి బిఆర్ అంబేద్కర్ హెచ్చరించారు.