కరోనా వ్యాప్తిని కట్టడి చేసేందుకు కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ను ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే దేశంలో పాజిటివ్ కేసుల కంటే రికవరీలు పెరుగుతుండటంతో భారత ప్రభుత్వం దశల వారీగా లాక్‌డౌన్‌ను ఎత్తివేస్తూ వస్తోంది.

తాజాగా ఆన్‌లాక్‌ 5 మార్గదర్శకాలను ప్రకటించడంతో.. కరోనా నుంచి ప్రజల జీవన విధానం సాధారణ స్థితికి వచ్చింది. దాదాపు అన్ని రకాల వ్యాపార, వాణిజ్య కార్యకలాపాలు యథావిధిగా సాగుతున్నాయి. అక్టోబర్‌ 15 నుంచి అమల్లోకి రానున్న ఈ మార్గదర్శకాలకు అనుగుణంగా ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం కూడా అన్‌లాక్‌ 5.0 గైడ్‌లైన్స్‌ను విడుదల చేసింది.

అన్‌లాక్ 5.0 నిబంధనాలు ఇవే : 

* రద్దీగా ఉండే ప్రదేశాల్లో మాస్కులు, భౌతికదూరం తప్పనిసరి 
* సినిమాహాళ్లు, షాపింగ్ మాల్స్, షాపుల వద్ద శానిటైజర్లు ఏర్పాటు చేయాలి. మాస్క్ లేకపోతే నో ఎంట్రీ
* ప్రజారవాణాలో కోవిడ్ నిబంధనలు కచ్చితంగా పాటించాలి
* ప్రార్థనా మందిరాల్లో కూడా కోవిడ్ నిబంధనలు పాటించేలి
* కోవిడ్ నిబంధనలు అమలయ్యేలా పర్యవేక్షణకు ప్రత్యేక అధికారి
* బస్టాండ్, రైల్వేస్టేషన్లలో మాస్క్‌లు ధరించేలా ప్రచారం , మైక్ అనౌన్స్‌మెంట్‌
* సినిమా హాల్స్‌లో కోవిడ్ నిబంధనలపై టెలీ ఫిల్మ్ ప్రదర్శనలు
* స్కూళ్లు, విద్యా సంస్థలు, పారిశ్రామిక కార్యకలాపాలు నిర్వహించే చోట కేంద్ర మార్గదర్శకాలు తప్పనిసరి
* విద్యార్థులు, అధ్యాపకులు ప్రతి పీరియడ్ తర్వాత శానిటైజేషన్ చేసుకునేలా యాజమాన్యాలు ఏర్పాటు చేయాలి