Asianet News TeluguAsianet News Telugu

చేనేత కార్మికుల కోసం ప్రత్యేక సర్వే... కీలక అంశాలపై ఆరా: మేకపాటి ప్రకటన

సొంత మగ్గం కలిగి ఉండి చేనేత వృతిపై ఆధారపడి జీవనం సాగిస్తోన్న నేతన్నలకు ప్రభుత్వం ఎప్పుడూ అండగా ఉంటుందని మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి వెల్లడించారు. 

AP Govt Plans Special survey on handcrop workers: Minister Mekapati
Author
Amaravathi, First Published Jun 4, 2020, 8:39 PM IST

అమరావతి: సొంత మగ్గం కలిగి ఉండి చేనేత వృతిపై ఆధారపడి జీవనం సాగిస్తోన్న నేతన్నలకు ప్రభుత్వం ఎప్పుడూ అండగా ఉంటుందని మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి వెల్లడించారు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన వైఎస్ఆర్ నేతన్న పథకం రెండో విడత అమలులో వేగం పెంచాలని మంత్రి అధికారులను ఆదేశించారు. 

అర్హులైన ప్రతి చేనేత లబ్ది పొందేలా చర్యలు చేపట్టాలన్నారు. అర్హత కలిగి ఏ  ఒక్కరూ ప్రభుత్వ సాయం పొందకుండా ఉండే పరిస్థితి లేకుండా చూడాలని మంత్రి మేకపాటి సూచించారు. జూన్ నెలలో రెండవ విడత నేతన్న నేస్తం ప్రారంభం కానున్న నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా అర్హులైన చేనేతల జాబితా, పూర్తి వివరాలు, ఆన్‌లైన్‌ పోర్టల్ అప్ లోడింగ్, వెరిఫికేషన్ ప్రక్రియను వేగవంతం చేయాలని మంత్రి పేర్కొన్నారు. 

read more   ఆయిల్ కంపెనీల తీరుపై మంత్రి కన్నబాబు అసంతృప్తి

చేనేత కార్మికుల జీవన ప్రమాణాలు మెరుగుపరచడానికి ఎటువంటి చర్యలు చేపట్టాలన్న విషయంలో కొన్ని కీలక అంశాలపై ఏజెన్సీ ద్వారా ఖచ్చితమైన సర్వే చేపట్టాలని మంత్రి ఆదేశించారు. వస్త్ర పరిశ్రమ ప్రాముఖ్యతను, ఉత్పత్తుల నాణ్యతను, ప్రచారాన్ని పెంచి చేనేతల కష్టాలకు  శాశ్వత పరిష్కారం చూపడమే ఈ సర్వే ముఖ్య ఉద్దేశమని మంత్రి గౌతమ్ రెడ్డి స్పష్టం చేశారు.  

ఈ సమీక్షా సమావేశంలో చేనేత,జౌళి శాఖ డైరెక్టర్ బీ.ఆర్ అంబేడ్కర్, అసిస్టెంట్ డైరెక్టర్ శ్రీకాంత్ ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు.

 
 

Follow Us:
Download App:
  • android
  • ios