విజయవాడ: రాష్ట్రంలోని ఆయిల్ కంపెనీ ప్రతినిధుల తీరుపై మంత్రి కన్న బాబు అసంతృప్తి వ్యక్తం చేశారు. గత సమావేశంలో ఆయిల్ కంపెనీల ప్రతినిధులతో జరిపిన చర్చలు కొలిక్కి రాకపోవడంతో సీఎం జగన్ ఆదేశాల మేరకు మంత్రి మరోసారి సమావేశమయ్యారు.  

సమీప రాష్ట్రాల్లో మాదిరిగానే ఓ.ఈ.ఆర్ రేటు నిర్ణయం జరగాలని... ఆయిల్ కంపెనీలు, రైతుల సమస్యల పరిష్కారం కోసం సానుకూల ధరను నిర్ణయించాలని మంత్రి స్పష్టం చేశారు. ఓ.ఈ.ఆర్ ధర పెంచుతూ నిర్ణయం తీసుకోవడంలో చేస్తున్న జాప్యం పట్ల మంత్రి కన్నబాబు  మండిపడ్డారు. ఆయిల్ ఫామ్ రైతులు ఉత్పాదక ఖర్చులు, కంపెనీల కొనుగోలు తదుపరి ఖర్చులను క్షుణ్ణంగా పరిశీలించారు మంత్రి. ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి ప్రభుత్వ నిర్ణయాన్ని ప్రకటిస్తామని కన్నబాబు ప్రకటించారు. 

ఈ సమావేశంలో వ్యవసాయ శాఖ మంత్రి కన్నబాబుతో పాటు ఉద్యాన శాఖ కమిషనర్ చిరంజీవి చౌదరి, వ్యవసాయ శాఖ కమిషనర్ అరుణ్ కుమార్, ఆయిల్ ఫెడ్ ఎండి శ్రీకాంతనాధ రెడ్డి పాల్గొన్నారు. 

read more   ప్రతీ విషయాన్ని లిటిగేషన్ పెడుతున్నారు.. టీడీపీపై మంత్రి ఆదిమూలపు ఫైర్

అలాగే రైతు సాధికార సంస్థ ఆధ్వర్యంలో ప్రకృతి వ్యవసాయ పద్దతుల్లో ప్రీ మాన్సూన్ డ్రై సోయింగ్ విధానంపై వీడియో కాన్ఫరెన్స్ ద్వారా చర్చించారు కన్నబాబు.  ఈ వీడియో కాన్ఫరెన్స్ లో జీరో బడ్జెట్ నేచురల్ ఫార్మింగ్ అధినేత విజయ కుమార్,  రాయలసీమ నాలుగు జిల్లాల జాయింట్ కలెక్టర్లు , జే.డి.ఏలు, డి.పి.ఎం.లు, రైతులు పాల్గొన్నారు.  

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ... కరువు జయించటానికి ఈ ప్రీ మాన్సూన డ్రై సోయింగ్ విధానం చాల ఉపయోగకరమన్నారు. రాయలసీమ జిల్లాల్లో ప్రకృతి వ్యవసాయ పద్దతుల ద్వారా ఈ విధానాన్ని రైతులందరికీ చేరే విధంగా ప్రణాళిక చేయాలని ప్రకృతి వ్యవసాయ శాఖా అధికారులను సూచించారు. 

రాష్ట్ర ప్రభుత్వం రైతు శ్రేయస్సు కొరకు అందుబాటులో ఉన్న అన్ని ఉత్తమ సాగు పద్దతులను వారికి దగ్గరకు చేరేలా కృషి చేస్తుందన్నారు. వర్షాభావ పరిస్థితుల్లో సాగు భూములను ఎడారి కాకుండా కాపాడుకోవటానికి ఈ పద్దతులు చాల ఉపయోగకరమని కన్న బాబు స్పష్టం చేశారు. 

రైతులు 365 రోజులు తమ భూమిని పంటలతో ఎలా కప్పి ఉంచుతున్నారో... ప్రణాళిక చేసుకుని సాగు చేస్తున్నారో వారి అనుభవాలను మంత్రితో పంచుకున్నారు. రైతులు తమ వ్యవసాయ పద్ధతులు ప్రకృతిని,జీవ వైవిధ్యాన్ని కాపాడే విధంగా ఉండేలా చూసుకోవాలని మంత్రి అధికారులను సూచించారు.