ఏపీ ప్రభుత్వం సంక్షేమ పథకాలు, ఉద్యోగుల జీతాలకు భారీగానే ఖర్చుపెడుతుంది. దేశంలోని ఆరు ప్రధాన రాష్ట్రాలకు సమానంగా ఖర్చు చేస్తోంది.  కొత్త పీఆర్సీని అమ‌లు చేస్తే రాష్ట్ర ఖజానాపై 10 వేల కోట్ల‌కు పైగా భారం ప‌డ‌నుంది. ఇప్ప‌టికే జీతాలు, పెన్ష‌న్ల రూపంలో 68,340 కోట్లు ఉద్యోగుల‌కు ఖ‌ర్చు పెడుతున్నారు. కొత్తగా పీఆర్సీ అమ‌లు చేయడం వల్ల కేవలం 78 వేల కోట్లు ఉద్యోగుల జీతాలు, పెన్ష‌న్ల కింద ఏపీ ప్ర‌భుత్వం భ‌రించాల్సి ఉంటుంది.

కొద్దినెలలుగా తీవ్ర ఉత్కంఠకు గురిచేసిన పీఆర్సీ వ్యవహారం ఓ కొలిక్కిరావడంతో ఏపీ ఉద్యోగ సంఘాలు సంబరాలు జరుపుకుంటున్నాయి. ఉద్యోగ నేతల డిమాండ్లకు ప్రభుత్వం దాదాపుగా అంగీకరించడంతో సమ్మె ఆలోచనను వారు ఉపసంహరించుకున్నారు. ఈ నేపథ్యంలో అసలు ప్రభుత్వం ఉద్యోగుల వేతనాలు, అలవెన్సులు, పెన్షన్‌లు ఇతరత్రా వాటికి ఎంత ఖర్చు పెడుతుందో తెలుసుకోవాలని ప్రజలు ఉత్సాహం చూపిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆ వివరాలు మీ కోసం.

ఏపీ ప్రభుత్వం సంక్షేమ పథకాలు, ఉద్యోగుల జీతాలకు భారీగానే ఖర్చుపెడుతుంది. దేశంలోని ఆరు ప్రధాన రాష్ట్రాలకు సమానంగా ఖర్చు చేస్తోంది. 2020-21లో ఉద్యోగుల కోసం ఏపీ 37,458 కోట్లు వ్యయం చేసింది. ఇది గతేడాది 33,102 కోట్ల రూపాయలుగా వుంది. ప్రభుత్వ ఆదాయంలో 36 శాతం ఉద్యోగుల కోసమే ఖర్చుపెడుతోందని ఓ నివేదికలో తేలింది. ప్రభుత్వ మొత్తం వ్యయంలో జీతాలు, పెన్షన్ల వాటా ఏపీలోనే అత్యధికమ‌ని చీఫ్ సెక్ర‌ట‌రీ స‌మీర్ శ‌ర్మ ఇచ్చిన నివేదిక తెలిపింది.

మిగులు బ‌డ్జెట్ తో ఉన్న తెలంగాణ రాష్ట్రం వాటా 21శాతం ఉండ‌గా.. ఏపీ ఉద్యోగుల జీతాలు, పెన్ష‌న్ల వాటా 36 శాతంగా ఉంది. కొత్త పీఆర్సీని అమ‌లు చేస్తే రాష్ట్ర ఖజానాపై 10 వేల కోట్ల‌కు పైగా భారం ప‌డ‌నుంది. ఇప్ప‌టికే జీతాలు, పెన్ష‌న్ల రూపంలో 68,340 కోట్లు ఉద్యోగుల‌కు ఖ‌ర్చు పెడుతున్నారు. కొత్తగా పీఆర్సీ అమ‌లు చేయడం వల్ల కేవలం 78 వేల కోట్లు ఉద్యోగుల జీతాలు, పెన్ష‌న్ల కింద ఏపీ ప్ర‌భుత్వం భ‌రించాల్సి ఉంటుంది. అంటే, రాబోయే రోజుల్లో ఉద్యోగుల జీతాల‌కు కూడా ప్రభుత్వం అప్పులకు వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. దేశంలో ఏపీతో పాటు హిమాచల్ ప్రదేశ్, నాగాలాండ్, ఉత్తరాఖండ్, కేరళ, త్రిపుర రాష్ట్రాల్లో ఖర్చు ఎక్కువగా వుందని ఓ సర్వే చెబుతోంది.

ఇక PRC సాధన సమితి సభ్యులు ఆదివారం నాడు క్యాంప్ కార్యాలయంలో జగన్ తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఉద్యోగ సంఘాలతో జగన్ మాట్లాడారు. తమ సమస్యలను సానుకూలంగా పరిష్కరించేందుకు ప్రయత్నించినందుకు సీఎం జగన్ కు AP Employees Union ధన్యవాదాలు తెలిపారు. ఈ ప్రభుత్వం మీదేనని .. మీ సహకారంతో మంచి చేయగలుగుతున్నానని ఉద్యోగ సంఘాలతో జగన్ చెప్పారు. ఆర్థిక పరిస్థితుల వల్ల, Corona ప్రభావం వల్ల మీరు ఆశించినంత రీతిలో ఇవ్వలేకపోవచ్చన్నారు. కానీ ఎంతమేర మేలు చేయగలుగుతామో అన్నిరకాలుగా చేశామన్నారు.

రాజకీయాలు ఇందులోకి వస్తే వాతావరణం దెబ్బతింటుందని ఆయన అభిప్రాయపడ్డారు.రాజకీయాలకు తావు ఉండకూడదని సీఎం జగన్ ఉద్యోగ సంఘాల నేతలకు తేల్చి చెప్పారు. ఏదైనా సమస్య ఉంటే.. అనామలీస్‌ కమిటీకూడా ఉన్న విషయాన్ని సీఎం గుర్తు చేశారు.ఎప్పుడైనా మీరు మీ సమస్యలను చెప్పుకోవచ్చని సీఎం జగన్ ఉద్యోగ సంఘాలకు చెప్పారు. ఉద్యోగ సమస్యలపై మంత్రుల కమిటీ కొనసాగుతుందన్నారు ఏ సమస్య ఉన్నా ఈ కమిటీకే చెప్పుకోవచ్చన్నారు. ప్రభుత్వం అంటే ఉద్యోగులదని సీఎం జగన్ స్పష్టం చేశారు. సమ్మె చేయాల్సిన అవసరం లేదన్నారు మంత్రుల కమిటీ తనతో టచ్‌లోనే ఉందని సీఎం జగన్ ఉద్యోగ సంఘాలకు వివరించారు. తన ఆమోదంతోనే మంత్రుల కమిటీ ఉద్యోగ సంఘాల సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చిందని చెప్పారు.