గత కొన్ని నెలలుగా సాగుతున్న సస్పెన్షన్‌కు ఏపీ సీఎం వైఎస్ జగన్ తెరదించారు. ఈ మేరకు శుక్రవారం పీఆర్సీపై ఆయన కీలక ప్రకటన చేశారు. ఉద్యోగులకు 23 శాతం ఫిట్‌మెంట్ ప్రకటిస్తున్నట్లు సీఎం వెల్లడించారు. దీనిపై ఉద్యోగ సంఘాల నేత వెంకట్రామిరెడ్డి స్పందించారు. ఇప్పుడున్న పరిస్ధితుల్లో దీనిని మంచి ఫిట్‌మెంట్‌గానే భావిస్తున్నట్లు ఆయన తెలిపారు.

గత కొన్ని నెలలుగా సాగుతున్న సస్పెన్షన్‌కు ఏపీ సీఎం వైఎస్ జగన్ తెరదించారు. ఈ మేరకు శుక్రవారం పీఆర్సీపై ఆయన కీలక ప్రకటన చేశారు. ఉద్యోగులకు 23 శాతం ఫిట్‌మెంట్ ప్రకటిస్తున్నట్లు సీఎం వెల్లడించారు. దీనిపై ఉద్యోగ సంఘాల నేత వెంకట్రామిరెడ్డి స్పందించారు. ఇప్పుడున్న పరిస్ధితుల్లో దీనిని మంచి ఫిట్‌మెంట్‌గానే భావిస్తున్నట్లు ఆయన తెలిపారు. కరోనా వల్ల ఆర్ధిక పరిస్ధితి బాగోలేదని.. అలాగే భవిష్యత్‌లోనూ ఆర్ధిక పరిస్ధితి ఎలా వుంటుందో తెలియదని, ఇలాంటి పరిస్ధితుల్లో 23 శాతం ఫిట్‌మెంట్ సముచితమైనదేనని వెంకట్రామిరెడ్డి అన్నారు. 

అన్ని పెండింగ్ డీఏలు ఈ జనవరి నుంచి అమలు చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారని ఆయన తెలిపారు. జనవరి జీతంతో కలిపి పెండింగ్ డీఏలన్నీ వస్తాయని వెంకట్రామిరెడ్డి చెప్పారు. గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగుల ప్రోబేషన్ డిక్లేర్ చేసి, పీఆర్సీ ప్రకారం పెరిగిన జీతాలను అమలు చేస్తామని జూన్ 30లోగా ప్రొబేషన్ కన్ఫర్మేషన్ చేస్తారని సీఎం చెప్పినట్లుగా వెంకట్రామిరెడ్డి తెలిపారు. ప్రతి నియోజకవర్గంలో , ప్రతి జిల్లాలో ప్రభుత్వం కట్టే కాలనీల్లో ప్రభుత్వ ఉద్యోగులకు పది శాతం రిబేట్‌తో ఫ్లాట్లు ఇస్తారని చెప్పినట్లు ఆయన వెల్లడించారు. 

కేంద్ర ప్రభుత్వం అమలు చేసే పీఆర్సీని రాష్ట్రంలోనూ అమలు చేయాలని కోరినట్లు వెంకట్రామిరెడ్డి చెప్పారు. దీనిపై ఉద్యోగ సంఘాలతో చర్చించి ప్రభుత్వానికి చెబుతామని ఆయన తెలిపారు. తొలి నుంచి కూడా సీఎం జగన్ మంచి పీఆర్సీ ఇస్తారని నమ్మకంగా వున్నామని.. అయితే ఫిట్‌మెంట్ కొంచెం తగ్గిందని వెంకట్రామిరెడ్డి అన్నారు. ప్రభుత్వ ఆర్ధిక పరిస్ధితిని అర్ధం చేసుకుని ఫిట్‌మెంట్‌కి అంగీకరించామని ఆయన చెప్పారు. జూన్ 30లోపు సీపీఎస్‌పై వివాదాన్ని పరిష్కరిస్తామని జగన్ చెప్పినట్లు వెంకట్రామిరెడ్డి వెల్లడించారు. అయితే 9వ తేదీన తమ సమావేశం జరుగుతుందన్నారు ఉద్యోగ సంఘం నేత బొప్పరాజు వెంకటేశ్వర్లు. ఒక్క హెచ్‌ఆర్‌ఏ విషయంలో స్పష్టత రాలేదని.. దీనిపై త్వరలోనే తేలుతుందని ఆయన అన్నారు. 

కాగా.. శుక్రవారం నాడు మధ్యాహ్నం ఉద్యోగ సంఘాలతో ఏపీ సీఎం Ys Jagan భేటీ అయ్యారు. ఈ సమావేశానికి ముందే ఏపీ సీఎం జగన్ ఆర్ధిక శాఖాధికారులతో సమావేశమయ్యారు. ఈ సమావేశం ముగిసిన తర్వాత ఉద్యోగ సంఘాల నేతలను చర్చలకు పిలిచారు. నిన్ననే ఉద్యోగ సంఘాల నేతలతో జగన్ చర్చించారు. ఈ సమావేశంలో ఉద్యోగ సంఘాలు తమ అభిప్రాయాలను సీఎం దృష్టికి తీసుకొచ్చారు. ఈ సమావేశంలో ఉద్యోగ సంఘాల నేతలు చెప్పిన అభిప్రాయాలను సీఎం నోట్ చేసుకొన్నారు. ఇవాళ మరోసారి ఉద్యోగ సంఘాల నేతలను పిలిపించి Prc ఫిట్‌మెంట్ 23.29 శాతం ఇస్తున్నట్టుగా ప్రకటించారు. ఏపీలో ఉద్యోగుల Retirement వయస్సు 60 నుండి 62 శాతానికి పెంచుతామని సీఎం జగన్ హామీ ఇచ్చారు.

ఈ ఏడాది జూన్ 30 లోపుగా కారుణ్య నియామకాలను చేపడుతామని సీఎం హామీ ఇచ్చారు. పెంచిన జీతాలను ఈ నెల నుండి అమల్లోకి వస్తాయని సీఎం హామీ ఇచ్చారు.2020 ఏప్రిల్ నుండి మానిటరీ బెనిఫిట్ అమలు చేస్తామని కూడా సీఎం ఉద్యోగ సంఘాల నేతలకు హామీ ఇచ్చారు.ఈహెచ్ఎస్ సమస్యల పరిష్కారానికి సీఎస్ అధ్యక్షతన కమిటీని ఏర్పాటు చేస్తామని కూడా సీఎం జగన్ చెప్పారు. రెండు వారాల్లో employees సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తామని జగన్ స్పష్టం చేశారు.