ఢిల్లీలో ఏపీ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధిగా ఎంపీ విజయసాయిరెడ్డి నియామకాన్ని రాష్ట్ర ప్రభుత్వం రద్దు చేసింది. ఈ మేరకు ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. కొద్దిరోజుల క్రితం విజయసాయిరెడ్డిని ప్రభుత్వ ప్రతినిధిగా నియమిస్తూ ఏపీ సర్కార్ జీవో నెం 68ని జారీ చేసింది. తాజాగా దానిని వెనక్కి తీసుకోవడం గమనార్హం.

ఒకే వ్యక్తి ఆదాయన్నిచ్చే రెండు వేర్వేరు పదవుల్లో ఉండరాదనే నిబంధన కారణంగానే విజయసాయిరెడ్ది నియామకాన్ని రద్దు చేస్తున్నట్లుగా తెలుస్తోంది.