Asianet News TeluguAsianet News Telugu

‘‘ ఎన్నికల తర్వాత విద్యాసంస్థల నిర్వహణ చూస్తా ’’... నారాయణ పాత వీడియోను బయటపెట్టిన సజ్జల

ఏపీలో పదో తరగతి ప్రశ్నాపత్రాల లీకేజ్ వ్యవహారానికి సంబంధించి మాజీ మంత్రి, టీడీపీ నేత నారాయణ అరెస్ట్ కలకలం రేపుతోన్న సంగతి తెలిసిందే. దీనిపై అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం  నడుస్తోంది.  ఈ నేపథ్యంలో విద్యాసంస్థల నిర్వహణకు సంబంధించి నారాయణ గతంలో మాట్లాడిన వీడియోను ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి విడుదల చేశారు. 

ap govt advisor sajjala ramakrishna reddy release video on ex minister narayana comments on his educational institutions
Author
Amaravathi, First Published May 11, 2022, 6:10 PM IST

విద్యాసంస్థలతో సంబంధం లేదని మాజీ మంత్రి, టీడీపీ (tdp) నేత నారాయణ (narayana) అంటున్న నేపథ్యంలో దానికి కౌంటర్‌గా వైసీపీ ప్రభుత్వం (ycp govt) ఒక వీడియో విడుదల చేసింది. ఎన్నికల తర్వాత విద్యాసంస్థలపై దృష్టి సారిస్తానంటూ గతంలో నారాయణ చెప్పిన మాటలను ప్రభుత్వ సలహాదారు, వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి (sajjala rama krishna reddy) విడుదల చేశారు. కరోనా వల్ల విద్యా రంగానికి తీవ్ర నష్టం జరిగిందని.. దీనిని మళ్లీ గాడిలో పెట్టాల్సిన అవసరం వుందని నారాయణ ఆ వీడియోలో వ్యాఖ్యానించారు. మరి దీనికి నారాయణ, టీడీపీ నేతలు ఎలా స్పందిస్తారో వేచి చూడాలి. 

అంతముందు బుధవారం నారాయణ అరెస్ట్‌పై సజ్జల రామకృష్ణారెడ్డి మీడియాతో మాట్లాడారు. మాల్ ప్రాక్టీస్ కేసులో ఉన్న ఆధారాలతోనే ఆయన అరెస్ట్ జరిగిందన్నారు. నారాయణ విద్యాసంస్థల అధినేత నారాయణ కాదా అని ప్రశ్నించారు. ఆ విద్యాసంస్థలతో సంబంధం లేదని నారాయణ చెప్పగలరా అని ప్రశ్నించారు. నారాయణ అరెస్ట్‌కు సంబంధించి వ్యవహారంపై బుధవారం సజ్జల మీడియాతో మాట్లాడుతూ.. తిరుపతిలో నారాయణ విద్యా సంస్థల డీన్‌ బాల గంగాధర్ కన్పెషన్ స్టేట్‌మెంట్‌ను చదివి వినిపించారు. 

వంద శాతం ఉత్తీర్ణత కోసం ఇలాంటి అక్రమాలకు పాల్పడుతున్నారని విమర్శించారు. ఓ మాఫియా మాదిరి ఏర్పడి మాల్ ప్రాక్టీసుకు పాల్పడ్డారని ఆరోపించారు. తప్పు జరిగినప్పుడు చట్టం తన పని తాను చేసుకుని పోతుందన్నారు. రాజకీయ కక్ష అంటూ చంద్రబాబు నాయుడు, టీడీపీ నాయకులు దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. రాజకీయ కక్ష అనే ఎదురుదాడి ముసుగులో ఎంతకాలం తప్పించుకుంటారని ప్రశ్నించారు. మాల్ ప్రాక్టీస్‌కు పాల్పడితే వదిలేయాలా అని ప్రశ్నించారు. మాల్ ప్రాక్టీస్ తప్పుకాదని టీడీపీ చెప్పగలదా..? అని మండిపడ్డారు.

విప్లవకారుడు అరెస్ట్ అయినట్లు చంద్రబాబు హడావిడి చేస్తున్నారని ఎద్దేశా చేశారు. కన్పెషన్ స్టేట్‌మెంట్ ఆధారంగానే నారాయణను అరెస్ట్ చేయడం జరిగిందన్నారు. నారాయణ విద్యాసంస్థలతో టెక్నికల్‌గా నారాయణకు సంబంధం లేకపోవచ్చు.. కానీ ఆయన చెబితేనే నేరం జరిగినప్పుడు అరెస్ట్ చేయడం తప్పా అని ప్రశ్నించారు. నారాయణ‌కు టెక్నికల్‌గా సంబంధం లేదని చెబుతున్నారని.. మరి నారాయణ అల్లుడు చైర్మన్‌గా, కూతుర్లు డైరెక్టర్లుగా ఉన్నారని.. మరి వారిని అరెస్ట్ చేయవచ్చా..? అని ప్రశ్నించారు. అలా చేస్తే నోరు మూసుకుంటారా అని ప్రశ్నించారు. ఇలాంటి చర్యలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలా..? వద్దా..? అని ప్రశ్నించారు. ఇలాంటి నేరాలపై కఠినంగా ఉండేందుకే జగన్ ప్రభుత్వం ఉంటుందన్నారు. దీనిపై హైకోర్టుకు వెళ్లేది చూస్తున్నారని చెప్పారు. ఇలాంటి నేరాలు చేయాలని అనుకునేవారికి భయం పుట్టేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు. 
 

Follow Us:
Download App:
  • android
  • ios