Asianet News TeluguAsianet News Telugu

రైతులకు ఉచిత విద్యుత్ అందించిన ఘనత ఆయనదే:వైఎస్ఆర్ అవార్డులు అందించిన గవర్నర్


పేదల సంక్షేమం కోసం వైఎస్ రాజశేఖర్  రెడ్డి ఎంతో కృషి  చేశారని ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ చెప్పారు.వైఎస్ఆర్ లైఫ్ టైమ్  ,వైఎస్ఆర్ అచీవ్ మెంట్అవార్డులను గవర్నర్ ఇవాళ అందించారు.

AP Governor Distributed Biswabhusan Harichandan  YSR Achievement Awards
Author
First Published Nov 1, 2022, 11:54 AM IST

అమరావతి:రైతులకు ఉచిత విద్యత్ అందించిన  ఘనత వైఎస్ రాజశేఖర్ రెడ్డిదేనని ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ చెప్పారు. వరుసగా రెండోఏడాది వైఎస్ఆర్ అచీవ్ మెంట్,వైఎస్ఆర్ లైఫ్ టైమ్ అచీవ్ మెంట్ అవార్డులను రాష్ట్ర ప్రభుత్వం  ఇవాళ అందించింది. తాడేపల్లిలోని క్యాంప్ కార్యాలయంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ముఖ్య అతిథిగా, వైఎస్ విజయమ్మ విశిష్ట అతిథిగా పాల్గొన్నారు.

AP Governor Distributed Biswabhusan Harichandan  YSR Achievement Awards

వివిధ రంగాల్లో విశేష కృషి చేసిన 35 మంది వ్యక్తులు,సంస్థలకు అవార్డులను అందిస్తున్నారు.20 వైఎస్ఆర్ లైఫ్ టైమ్ అచీవ్ మెంట్,15 వైఎస్ఆర్ అచీవ్ మెంట్ అవార్డులు అందించనున్నారు.ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో గవర్నర్ బిశ్వభూషణ్ ప్రసంగించారు.

వైఎస్ఆర్ రైతు పక్షపాతిగా నిలిచారన్నారు.పేదల సంక్షేమం కోసం అనేక పథకాలను వైఎస్ఆర్ చేశారని ఆయన గుర్తు చేసుకున్నారు.సంతృప్తస్థాయిలో  పథకలు అమలు చేసిన పేదలకు అండగా  నిలిచారన్నారు.ఆరోగ్య శ్రీతో పేదలకు కార్పోరేట్ వైద్యాన్ని వైఎస్ఆర్ అందుబాటులోకి తెచ్చారని ఆయన చెప్పారు. సాగునీటి ప్రాజెక్టులునిర్మించి బీడు భూములను సస్యశ్యామలం చేశారని  గవర్నర్  గుర్తు చేశారు.రాష్ట్రాభివృద్దిలో వైఎస్ఆర్ సేవలు మరువలేనివన్నారు.

also read:ఏపీలోఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవ వేడుకలు: తాడేపల్లిలో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన జగన్

అంతకు ముందు ఏపీ  సీఎం వైఎస్  జగన్  ప్రసంగించారు. సామాన్యుల్లో ఉన్న అసామాన్యులకు అవార్డులు అందిస్తున్నామన్నారు.అసామాన్య సేవలందిస్తున్న మానవతామూర్తులకు వందనం  చెబుతున్నానన్నారు సీఎం. ఎక్కడాలేని విధంగా రాష్ట్రంలో అవార్డులు అందిస్తున్నామని ఆయన చెప్పారు.సంస్కృతి, సంప్రదాయాలకు వారుధులుగా ఉన్నవారికి  అవార్డులు  ఇస్తున్నట్టుగా సీఎం తెలిపారు.వెనుకబాటు ,అణచివేత,పెత్తందారీ పోకడలపై దండయాత్ర చేస్తున్నసామాజిక ఉద్యమకారులు,కళాకారులు, పాత్రికేయులు,పారిశ్రామిక ధిగ్గజాలకు అవార్డులు అందిస్తున్నట్టుగా ఆయన వివరించారు.అవార్డులుఅందుకుంటున్నప్రతి ఒక్కరికి ఆయన  అభినందనలు తెలిపారు.

Follow Us:
Download App:
  • android
  • ios