అమరావతి: ఏలూరులో పలువురు అస్వస్థతకు గురైన ఘటనపై ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ఆరా తీశారు.

శనివారం నాడు సాయంత్రం నుండి ఏలూరులో పలువురు అస్వస్థతకు గురైన విషయం తెలిసిందే. అస్వస్థతకు గురైనవారికి ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు.సీరియస్ గా ఉన్నవారిని విజయవాడకు తరలించారు. బాధితుల నుండి శాంపిల్స్ సేకరించారు. ఈ శాంపిల్స్ ను  నిపుణులు పరీక్షిస్తున్నారు.

also read:ఏలూరు వాసుల అస్వస్థతకు కారణమదే: చంద్రబాబు సంచలనం

ఏలూరులో ఎంతమంది అస్వస్థతకు గురయ్యారు. అస్వస్థతకు గల కారణాలపై గవర్నర్ అధికారులను అడిగి తెలుసుకొన్నారు.ప్రజల ఆరోగ్యాన్ని కాపాడేందుకు అధికారులు చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. ఈ సమస్యకు గల కారణాలను తెలుసుకొనేందుకు ఉన్నతస్థాయి నిపుణులను సంప్రదించాలని ఆయన ఆదేశించారు.

ఏలూరులో ఎందుకు ఇలా ప్రజలు అస్వస్థతకు గురయ్యారనే విషయమై అర్ధం కావడం లేదని వైద్యులు చెబుతున్నారు. అస్వస్థతకు గురైనవారిలో నయమైనవారిని ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ చేశారు.

ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నవారిని మంత్రి ఆళ్ల నాని, మాజీ మంత్రి లోకేష్, బీజేపీ ఏపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు తదితరులు పరామర్శించారు.