Asianet News TeluguAsianet News Telugu

పంచాయితీ ఎన్నికల నిర్వహణపై పరస్పరం సహకరించుకోవాలి: ఎస్ఈసీ, సీఎస్‌కి గవర్నర్ సూచన

ఎలాంటి ఇబ్బందుల్లేకుండా పంచాయతీ ఎన్నికలు నిర్వహించడంపై నిమ్మగడ్డ రమేష్ కుమార్, ఆదిత్యనాథ్ దాస్ తో గవర్నర్ చర్చించారు. 

AP Governor biswabhusan Harichandan gives suggestions to SEC and Chief secretary on local body elections lns
Author
Guntur, First Published Jan 27, 2021, 12:18 PM IST

 అమరావతి: ఎలాంటి ఇబ్బందుల్లేకుండా పంచాయతీ ఎన్నికలు నిర్వహించడంపై నిమ్మగడ్డ రమేష్ కుమార్, ఆదిత్యనాథ్ దాస్ తో గవర్నర్ చర్చించారు. 

బుధవారం నాడు ఉదయం ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్, ఏపీ సీఎస్ ఆదిత్యనాథ్ దాస్ సమావేశమయ్యారు.  ఎన్నికల నిర్వహణ విషయంలో ఇద్దరు అధికారులతో ఆయన చర్చించారు. వేర్వేరుగానే ఈ ఇద్దరు నేతలు  ఇవాళ గవర్నర్ తో భేటీ అయ్యారు. ఈ సమావేశంలో ఇద్దరు కీలక అదికారులకు గవర్నర్ పలు సూచనలు చేశారు.

AP Governor biswabhusan Harichandan gives suggestions to SEC and Chief secretary on local body elections lns

ప్రభుత్వం-ఎస్‍ఈసీ మధ్య అంతరం తగ్గించేందుకు ఆయన ప్రయత్నించారు. ఇద్దరూ పరస్పరం సహకరించుకోవాలని సూచించారు.పంచాయతీరాజ్ అధికారుల అభిశంసనపై ఎస్‍ఈసీతో గవర్నర్ మాట్లాడారు. శాంతిభద్రతలు, ఎన్నికల ఏర్పాట్లపై సీఎస్ ఆదిత్యనాథ్‍తో గవర్నర్ చర్చించారు. పోలింగ్‍తోపాటు వ్యాక్సినేషన్‍కి తీసుకుంటున్న చర్యలపై సీఎస్‍తో ఆయన చర్చించారు.

రాష్ట్రంలో ఎన్నికల నిర్వహణ విషయంలో ఏపీ ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్, ప్రభుత్వానికి మధ్య అంతరం కొనసాగుతోంది. ఈ పరిణామాల నేపథ్యంలో సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఎన్నికల నిర్వహణ విషయంలో ప్రభుత్వం దిగొచ్చింది. 

also read:గవర్నర్‌తో నిమ్మగడ్డ భేటీ: రాజ్‌భవన్ కు సీఎస్ ఆదిత్యనాథ్ దాస్

ఎన్నికల సంఘం ప్రకటించిన షెడ్యూల్ ప్రకారంగా ఎన్నికల నిర్వహణకు  సహకరిస్తామని ఏపీ ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ పరిణామాల నేపథ్యంలో ఇవాళ ఈ ఇద్దరు నేతలు గవర్నర్ తో  సమావేశమై ఎన్నికల నిర్వహణకు తీసుకొన్న చర్యలపై చర్చించారు.

 


 

Follow Us:
Download App:
  • android
  • ios