అభివృద్ధి కోసమే మూడు రాజధానులు: గవర్నర్ బిశ్వభూషణ్
ఏపీ రాష్ట్ర గవర్నర్ ఆదివారంనాడు విజయవాడలో రిపబ్లిక్ డే ను పురస్కరించుకొరి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు.
అమరావతి: రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేసేందుకు గాను రాష్ట్ర ప్రభుత్వం రాజధానిని మూడు ప్రాంతాల్లో పంపిణీ చేసే నిర్ణయం తీసుకొందని ఏపీ రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ చెప్పారు.
Also read:దేశానికి తెలంగాణ రోల్‌మోడల్: గవర్నర్ తమిళిసై
ఆదివారం నాడు ఉదయం విజయవాడ మున్సిపల్ స్టేడియంలో నిర్వహించిన 71వ గణతంత్ర దినోత్సవ వేడుకల్లో గవర్నర్ బిశ్వభూషణ్ పాల్గొన్నారు. తొలుత గవర్నర్ బిశ్వభూషణ్ రిపబ్లిక్ డేను పురస్కరించుకొని జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగించారు.
విశాఖలో ఎగ్జిక్యూటివ్ కేపిటల్, అమరావతిలో శాసన రాజధాని, కర్నూల్‌లో జ్యుడీషియల్ రాజధాని పెట్టాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని గవర్నర్ చెప్పారు. . పాలన వికేంద్రీకరణ ద్వారా ప్రజలకు, ప్రభుత్వానికి మధ్య దూరం తగ్గుతుందని గవర్నర్ అభిప్రాయపడ్డారు.
అభివృద్ది, పాలనా వికేంద్రీకరణతో అన్ని వర్గాలకు న్యాయం జరుగుతుందని హరిచందన్ అభిప్రాయపడ్డారు. ప్రజల సంక్షేమం కోసం ప్రభుత్వం నవరత్నాలను తీసుకొచ్చిందని చెప్పారు.
గ్రామ, వార్డు సచివాలయాల ఏర్పాటుతో రాష్ట్రం ఆదర్శంగా నిలిచిందని కొనియాడారు. సచివాలయాల ద్వారా 500 రకాల సేవలు అందుతున్నాయన్నారు.
సచివాలయల ఏర్పాటుతో 4లక్షల మందికి ఉద్యోగాలు వచ్చిన విషయాన్ని గవర్నర్ గుర్తు చేశారు. . రైతు భరోసా పథకం రూ.13,500 మందికి ఇస్తున్నామన్నారు. ధరల స్థిరీకరణ కోసం రూ.3 కోట్ల నిధిని ప్రభుత్వం ఏర్పాటు చేసిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. రైతులకు 9గంటల పాటు నిరంతర విద్యుత్ అందిస్తోన్న విషయాన్ని గవర్నర్ గుర్తు చేశారు. 100 శాతం అక్షరాస్యతకు ప్రభుత్వం కృషి చేస్తోందని చెప్పారు.
ప్రభుత్వ స్కూళ్లలో ఇంగ్లిష్ మీడియం ప్రవేశపెడుతోందన్నారు. ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టినా కూడ తెలుగును తప్పనిసరి చేసిన విషయాన్ని గవర్నర్ గుర్తు చేశారు. మనబడి, నాడు-నేడుతో ప్రభుత్వ స్కూళ్ల అభివృద్ధి జరుగుతుందన్నారు. . ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, ఆంధ్రప్రదేశ్ హై కోర్ట్ చీఫ్ జస్టిస్ జె.కె. మహేశ్వరి, ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని, డీజీపీ గౌతమ్ సవాంగ్, తదితరులు పాల్గొన్నారు.