గవర్నర్ కోటాలో నలుగురు ఎమ్మెల్సీలు: ఆమోదించిన బిశ్వభూషణ్
గవర్నర్ కోటాలో ఏపీ ప్రభుత్వం పంపిన నలుగురు పేర్లకు రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ఆమోదముద్రవేశారు.
అమరావతి: గవర్నర్ కోటాలో ఏపీ ప్రభుత్వం పంపిన నలుగురు పేర్లకు రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ఆమోదముద్రవేశారు.గవర్నర్ కోటా కింద ఎమ్మెల్సీలుగా లేళ్ల అప్పిరెడ్డి, తోట త్రిమూర్తులు,రమేష్ యాదవ్, మోషేన్ రాజా పేర్లను ఏపీ ప్రభుత్వం గత వారంలో పంపింది. ఈ పేర్లకు గవర్నర్ ఆమోదం తెలిపారు. గవర్నర్ తో ఇవాళ సాయంత్రం ఏపీ సీఎం జగన్ సుమారు 40 నిమిషాలకుపైగా భేటీ అయ్యారు. ఈ భేటీ ముగిసిన కొద్దిసేపటికే రాష్ట్ర ప్రభుత్వం పంపిన నలుగురు పేర్లకు గవర్నర్ ఆమోదం తెలిపింది.
also readఎమ్మెల్సీల నియామకం: వైఎస్ జగన్ కు గవర్నర్ షాక్, సాయంత్రం భేటీ
also read:గవర్నర్ కోటా ఎమ్మెల్సీలు: నలుగురి పేర్లు సిఫారసు చేసిన ఏపీ సర్కార్
గవర్నర్ కోటా ఎమ్మెల్సీల పదవీకాలం ఈ నెల 11వ తేదీతో పూర్తైంది. కొత్తగా గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీల పేర్లను నామినేట్ చేయాల్సిన అవసరం నెలకొంది. టీడీపీకి చెందిన టీడీ జనార్ధన్, బీద రవిచంద్రయాదవ్, గౌనిగారి శ్రీనివాసులు నాయుడు, పి.శమంతకమణిల పదవీకాలం ముగిసింది. శమంతకమణి టీడీపీని వీడి వైసీపీలో చేరింది. మిగిలిన ముగ్గురు టీడీపీలోనే ఉన్నారు.
గతంలో ఎమ్మెల్సీ పదవిని చివరి నిమిషనంలో మోషేను రాజు కోల్పోయారు. దీంతో గవర్నర్ కోటాలో ఈ దఫా సిఫారసు చేసినట్టుగా సమాచారం.2019 ఎమ్మెల్యే ఎన్నికల్లో అప్పిరెడ్డికి సీటు కేటాయించలేకపోవడంతో ఈ దఫా ఆయనకు ఎమ్మెల్సీ అవకాశం ఇవ్వాలని జగన్ భావించారు.