గవర్నర్ కోటా ఎమ్మెల్సీలు: నలుగురి పేర్లు సిఫారసు చేసిన ఏపీ సర్కార్
రాష్ట్రంలో గవర్నర్ కోటాలో ఖాళీగా కానున్న ఎమ్మెల్సీ స్థానాలను భర్తీ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం అభ్యర్ధులను ఖరారు చేసింది. ఈ మేరకు ఏపీ సీఎం వైఎస్ జగన్ గవర్నర్ కు నలుగురి పేర్లను పంపినట్టుగా సమాచారం. ఇవాళ లేదా రేపు ఈ ప్రతిపాదనలకు గవర్నర్ ఆమోదం తెలిపే అవకాశం ఉంది.
అమరావతి: రాష్ట్రంలో గవర్నర్ కోటాలో ఖాళీగా కానున్న ఎమ్మెల్సీ స్థానాలను భర్తీ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం అభ్యర్ధులను ఖరారు చేసింది. ఈ మేరకు ఏపీ సీఎం వైఎస్ జగన్ గవర్నర్ కు నలుగురి పేర్లను పంపినట్టుగా సమాచారం. ఇవాళ లేదా రేపు ఈ ప్రతిపాదనలకు గవర్నర్ ఆమోదం తెలిపే అవకాశం ఉంది.పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన మోషేను రాజు, గుంటూరు జిల్లాకు చెందిన లేళ్ల అప్పిరెడ్డి, కడప జిల్లాకు చెందిన ఆర్వీ రమేష్ యాదవ్, తూర్పు గోదావరి జిల్లాకు చెందిన తోట త్రిమూర్తులు పేర్లు ఉన్నాయని సమాచారం.
గవర్నర్ కోటా ఎమ్మెల్సీల పదవీకాలం ఇవాళ్టితో పూర్తి కానున్న నేపథ్యంలో కొత్తగా గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీల పేర్లను నామినేట్ చేయాల్సిన అవసరం నెలకొంది. టీడీపీకి చెందిన టీడీ జనార్ధన్, బీద రవిచంద్రయాదవ్, గౌనిగారి శ్రీనివాసులు నాయుడు, పి.శమంతకమణిల పదవీకాలం ముగిసింది. శమంతకమణి టీడీపీని వీడి వైసీపీలో చేరింది. మిగిలిన ముగ్గురు టీడీపీలోనే ఉన్నారు.
గతంలో ఎమ్మెల్సీ పదవిని చివరి నిమిషనంలో మోషేను రాజు కోల్పోయారు. దీంతో గవర్నర్ కోటాలో ఈ దఫా సిఫారసు చేసినట్టుగా సమాచారం.2019 ఎమ్మెల్యే ఎన్నికల్లో అప్పిరెడ్డికి సీటు కేటాయించలేకపోవడంతో ఈ దఫా ఆయనకు ఎమ్మెల్సీ అవకాశం ఇవ్వాలని జగన్ భావించారు.