గుంటూరులో భవన నిర్మాణ పనుల్లో ముగ్గురు మృతి: ఇద్దరు అధికారుల సస్పెన్షన్


గుంటూరు శివారులోని ముత్యాలరెడ్డి‌నగర్ లో భవన నిర్మాణ కూలీలు మృతి చెందిన ఘటనలో  ఇద్దరు అధికారులపై  ప్రభుత్వం చర్యలు తీసుకొంది. మరో వైపు నిర్మాణ సంస్థపై కూడా ప్రభుత్వం చర్యలు తీసకొనే అవకాశం ఉంది.

AP Government suspends TPBO and TPS for Three killed  at Building construction in Guntur district


గుంటూరు: Guntur శివారులోని ముత్యాలరెడ్డి నగర్ లో భవన నిర్మాణ పనుల్లో Workers మృతి చెందిన ఘటనలో  ప్రభుత్వం చర్యలు తీసుకొంది.  టీపీబీఓ, టీపీఎస్‌లను సస్పెండ్ చేసింది. ముత్యాలరెడ్డి నగర్‌లో భవన నిర్మాణ పనుల్లో మట్టిపెళ్లలు విరిగిపడి ముగ్గురు కార్మికులు దుర్మరణం చెందారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. బెంగాల్, బిహార్‌లకు చెందిన మజ్ను, నజీబ్, అమీన్‌లుగా మృతులను గుర్తించారు. కాగా, జీజీహెచ్‌లో మరో ఇద్దరు వలస కార్మికులకు చికిత్స అందిస్తున్నారు.

ఈ ఘటనపై సైట్ ఇంజనీర్, టెక్నికల్ పర్సన్, Builder  పై చర్యలు తీసుకోవాలని కూడా ప్రభుత్వం భావిస్తుంది. మల్టీప్లెక్స్ సెల్లార్ నిర్మాణం కోసం సుమారు 40 అడుగుల లోతు పునాది తీశారు. ఈ పునాది తీసి అందులో ఐరన్ రాడ్‌ల బెండింగ్‌కు సంబంధించిన పనులు చేస్తున్నారు. ఈ పని చేస్తుండగా పూడిక తీసిన భాగంలో మట్టి పెళ్లలు విరిగిపడ్డాయి. ఈ మట్టిపెళ్లల కింద సుమారు ఐదుగురు చిక్కుకున్నారు.

వీరంతా Bihar, West Bengal నుంచి వలస వచ్చిన కార్మికులు. 20 నుంచి 30 అడుగుల లోతు తీసిన పునాదిలోనే ఇనుప రాడ్లకు సంబంధించిన పనులు చేస్తున్నారు. అప్పుడు సుమారు 40 నుంచి 50 మంది కార్మికులు అక్కడ ఉన్నారని స్థానికులు చెప్పారు. ఇనుప రాడ్లకు సంబంధించిన పనులు చేస్తున్న సమయంలో మట్టిపెళ్లలు కూలాయి. ఆ ఘటనలో ఐదుగురు కార్మికులు చిక్కుకుపోయారు. ఈ ఘటనలో ఇద్దరు కార్మికులు తృటిలో తప్పుకున్నారు.  ముగ్గురిపై ఎక్కువగా మట్టిపెళ్లలు పడ్డాయి. దీంతో ఈ ముగ్గురు మరణించారు.

సంఘటన స్థలాన్ని అధికారులు పరిశీలించారు.ఘటనాస్థలికి హుటాహుటిన నగర మేయర్ మనోహర్ నాయుడు, కమిషనర్ వచ్చారు. మృతుల కుటుంబాలను ఆదుకుంటామని, వారికి అన్యాయం జరగనివ్వమని హామీ ఇచ్చారు. అయితే, ఈ మల్టిప్లెక్స్ నిర్మాణం, సెల్లార్ నిర్మాణానికి సంబంధించిన అనుమతుల గురించి ఆరా తీస్తున్నామని వివరించారు.

 కార్మిక సంఘాలు ఘటనా స్థలానికి చేరుకున్నారు. నిర్లక్ష్యం కారణంగానే కార్మికులు మరణించారని ఆరోపించారు. యాజమాన్యాన్ని వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. మరణించిన కార్మికుల కుటుంబాలకు, గాయపడినవారికీ న్యాయం చేయాలని నినాదాలు చేశారు.

 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios