ఏపీ ఎన్నికల కమీషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ కు రాష్ట్ర ప్రభుత్వానికి మధ్య వార్ అలాగ కొనసాగుతోంది. తాజాగా ఏపీ సర్కార్ నిమ్మగడ్డకు మరో షాక్ ఇచ్చింది. ఫిబ్రవరిలో పంచాయతీ ఎన్నికలు నిర్వహించడం సాధ్యం కాదని హైకోర్టులో ఏపీ ప్రభుత్వం పిటిషన్ దాఖలు చేసింది.

ఫిబ్రవరిలో ఎన్నికలు నిర్వహిస్తామని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ చేసిన ప్రకటనపై హైకోర్టులో పంచాయతీరాజ్ ప్రిన్సిపల్ సెక్రటరీ గోపాలకృష్ణ ద్వివేది పిటిషన్ వేశారు. ప్రభుత్వాన్ని సంప్రదించకుండా ఏకపక్షంగా ఎన్నికల కమిషనర్ ప్రకటన చేశారని ఆ పిటిషన్ లో ప్రభుత్వం పేర్కొంది. పిటిషన్ లో ప్రతివాదిగా ఎన్నికల కమిషన్ కార్యదర్శిని చేర్చారు.
ఎన్నికల కమిషనర్ ప్రకటన సుప్రీంకోర్టు ఆదేశాలకు విరుద్ధంగా ఉందని ప్రభుత్వం పేర్కొంది. కరోనా సమయంలో ప్రజారోగ్యం ప్రభుత్వం కర్తవ్యమని పిటిషనర్ పేర్కొన్నారు. ఇప్పటికే కరోనా కారణంగా 6 వేల మంది మరణించారని ప్రభుత్వం పేర్కొంది.
గతంలో కరోనా అని ఎన్నికలు వాయిదా వేసి, మరల ఎన్నికలు నిర్వహిస్తామని కమిషన్ పేర్కొనడంపై అభ్యంతరం వ్యక్తం చేస్తోంది ప్రభుత్వం, వెంటనే ఎన్నికల ప్రక్రియను నిలిపివేస్తూ తగిన ఆదేశాలివ్వాలని ప్రభుత్వం పిటిషన్ లో కోరింది.
Read Exclusive COVID-19 Coronavirus News updates, from Telangana, India and World at Asianet News Telugu.
వర్చువల్ బోట్ రేసింగ్ గేమ్ ఆడండి మిమ్మల్ని మీరు ఛాలెంజ్ చేసుకోండి ఇప్పుడే ఆడటానికి క్లిక్ చేయండి
Last Updated Dec 1, 2020, 4:41 PM IST