Asianet News TeluguAsianet News Telugu

కోవిడ్ రూంలోకి మీ కూతుళ్లను పంపిస్తారా..?: జగన్ పై కెఏ పాల్ ఫైర్

రాష్ట్రంలో కరోనా తీవ్రత దృష్ట్యా టెన్త్, ఇంటర్ పరీక్షలు వాయిదా వేయాలంటూ కేఏ పాల్ చేపట్టిన దీక్ష నేడుకూడా కొనసాగుతోంది.    

my protest continue may 3rd...KA Paul announced akp
Author
Visakhapatnam, First Published Apr 30, 2021, 1:57 PM IST

విశాఖపట్నం: ఏపీలో పరీక్షలు వాయిదా వేయాలని డిమాండ్ చేస్తూ కేఏ పాల్ చేపట్టిన దీక్ష రెండవ రోజుకు చేరుకుంది. రాష్ట్రంలో కరోనా తీవ్రత దృష్ట్యా టెన్త్ , ఇంటర్ పరీక్షలు వాయిదా వేయాలంటూ పాల్ నిన్న దీక్షకు దిగారు.  పరీక్షలు వాయిదా పడేవరకు దీక్ష కొనసాగిస్తానని కేఏపాల్ స్పష్టం చేశారు.
 
''టెన్త్ ఇంటర్ పరీక్షల రద్దుకోసం నేను హైకోర్టులో వేసిన పిల్ పై విచారణ జరిగింది. విచారణను మే మూడవ తేదికి వాయిదా వేసారు. కాబట్టి నా దీక్షను మే 3వ తేది వరకు కొనసాగిస్తా'' అని కెఏ పాల్ స్పష్టం చేశారు. 

read more  టెన్త్, ఇంటర్ పరీక్షలపై పున:పరిశీలించండి: ఏపీ సర్కార్‌కి హైకోర్టు సూచన

''ఏపిలో బుర్రలేని విద్యాశాఖ మంత్రి ఉన్నాడు. ఆయనకే బుర్ర ఉంటే ఇలాంటి నిర్ణయం తీసుకోరు. సీఎం జగన్మోహన్ రెడ్డి కోవిడ్ తన కూతుళ్ళను కరోనా వున్నరూమ్ లోకి పంపిస్తారా? రాష్ట్రంలోని విద్యార్థులు నీ బిడ్డలే కదా? అలాంటిది వారిని కరోనా సమయంలో పరీక్షలు రాయమనడం ఎంతవరకు సబబు'' అని పాల్ నిలదీశారు. 

''దయచేసి ఇప్పటికైనా పది, ఇంటర్ పరీక్షలు వాయిదా వెయ్యండి. పిల్లల ప్రాణాలతో చేలగాటం వద్దు. పరీక్షలు వాయిదా వేసేంతవరకు నా పోరాటం కొనసాగుతుంది'' అని కెఏ పాల్ తెలిపారు.

Follow Us:
Download App:
  • android
  • ios